నా జీవితాన్ని నాశనం చేశారు.. ఆ ఆరుగురే నా మరణానికి కారణం అంటూ.. విశాఖలో విషాదం

తన మరణానికి కారణమైన వారికి శిక్షపడేలా చూడాలంటూ మొదటి భార్యను కోరారు.

నా జీవితాన్ని నాశనం చేశారు.. ఆ ఆరుగురే నా మరణానికి కారణం అంటూ.. విశాఖలో విషాదం

Vizag Tragedy: విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేర సంబంధం భర్త ప్రాణాలు బలిగొంది. రెండో భార్య, ఫ్రెండ్ చేసిన మోసం తట్టుకోలేక దండేల హరిప్రకాశ్ అనే వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. తన చావుకు ఆరుగురు కారణమంటూ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు. ఈ వీడియోను తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపించాడు. ఆరు పేజీల లేఖ కూడా రాశాడు. తన మరణానికి కారణమైన వారికి శిక్షపడేలా చూడాలంటూ మొదటి భార్యను కోరారు. దీంతో ఆమె ద్వారకా స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రకాశ్‌కు 2010లో వరలక్ష్మితో వివాహం అయింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత పెంకా రాజేశ్ ద్వారా పరిచయమైన దండేల భువనేశ్వరిని 2019లో రెండో పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరికో పాప పుట్టింది. అయితే రాజేశ్‌తో భువనేశ్వరి వివాహతర సంబంధం పెట్టుకున్న విషయం తెలియడంతో హరిప్రకాశ్‌ హతశుడయ్యాడు. భార్యకు ఎంత నచ్చజెప్పినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడం, ప్రాణస్నేహితుడే వెన్నుపోటు పోవడంతో కుంగిపోయిన హరిప్రకాశ్‌ చివరకు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.

తన మరణానికి తన భార్య దండేల భువనేశ్వరి, ఆమె తల్లి శ్రీమంతుల సత్యవతి, శ్రీమంతుల మణికొండ, టెంకా రాజేశ్, అప్పికొండ వరప్రసాద్, అప్పికొండ పద్మావతి కారణమని లేఖలో రాసి, వీడియోలో కూడా స్వయంగా చెప్పాడు. కూతురి భవిష్యత్తు కోసం చాలా ఓపిక పట్టానని, ఇక తట్టుకోకలేక ఇలా వెళ్లిపోతున్నానని చెప్పాడు. తనకు క్షమించాలని కుటుంబ సభ్యులతో పాటు మొదటి భార్య వరలక్ష్మిని వేడుకున్నాడు. తన చావుకు కారణమైన వారికి విడిచిపెట్టొద్దని, వారికి శిక్షపడేలా చూడాలని కోరారు.

Also Read: నువ్వే నమ్మకుంటే ఇంకెవరు నమ్ముతారు.. కంటితడి పెట్టిస్తున్న బీటెక్ విద్యార్థిని చివరి లెటర్

భువనేశ్వరి తన కాపురంలో చిచ్చుపెట్టి, హరిప్రకాశ్‌ను పొట్టన పెట్టుకుందని వరలక్ష్మి 10టీవీతో వాపోయింది. అన్నింటికీ భువనేశ్వరి, రాజేశ్ మూలకారకులని.. వారిళ్లదరినీ చంపేసి హరిప్రకాశ్‌ చచ్చిపోయివుంటే ఏ గొడవా లేకపోయేదని ఆమె అన్నారు. అధికార బలం అండ చూసుకుని వీరిద్దరూ రెచ్చిపోయారని, వారికి చట్టప్రకారం తగిన శిక్ష పడాలని కోరారు.