తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన సిద్ధరామయ్య.. కీలక వ్యాఖ్యలు

గేట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని, రేపటి నుంచి గేటు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.

తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన సిద్ధరామయ్య.. కీలక వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల చరిత్రలో గేట్‌ను అతిక్రమించడం ఇదే తొలిసారని చెప్పారు. నీటి ప్రవాహానికి డ్యామ్ గేటు కొట్టుకుపోయిందని, 70 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్ తుంగభద్ర రిజర్వాయర్ అని అన్నారు.

గేట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని, రేపటి నుంచి గేటు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రిటైడ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు, తదితరుల బృందం ఆధ్వర్యంలో గేట్ పనులు సాగుతున్నాయని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు నేతృత్వంలో రేపటి నుంచి తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి గేట్ మార్చాలని తెలిపారు.

ఇక నుంచి నిపుణులు చెప్పినట్లుగా రిజర్వాయర్‌ను నిర్వహించనున్నారని చెప్పారు. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ గేటు పగలలేదని, ఇప్పటికైనా నీళ్లు ఆపడమే తమ లక్ష్యమని అన్నారు. నీటిని పొదుపు చేయాలని, రైతులకు రక్షణ కల్పించాలని చెప్పారు. మొదటి పంటకు ఇబ్బంది లేదని, రెండో పంట గురించి చూద్దామని తెలిపారు. గేటు వేసినా 63 టీఎంసీల నీరు మిగిలి ఉంటుందని, రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదుని చెప్పారు.

Also Read: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. పూర్తి వివరాలు తెలిపిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత