చంద్రబాబుకు నా వైపు నుంచి చేస్తున్న విజ్ఞప్తి ఇదే: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

బ్రిజేశ్ కుమార్ ఇచ్చిన తీర్పుపై తాను స్టే తెచ్చి 11 ఏళ్లు అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

చంద్రబాబుకు నా వైపు నుంచి చేస్తున్న విజ్ఞప్తి ఇదే: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Nallari Kiran Kumar Reddy

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలను విభజించి చాలా తప్పు చేశారని, తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే జిల్లాలను మళ్లీ కలిపే వాడినని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు తన వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నానని, నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే ముందు బ్రిజేశ్ కుమార్ ని తప్పించాలని అన్నారు.

బ్రిజేశ్ కుమార్ ఇచ్చిన తీర్పుపై తాను స్టే తెచ్చి 11 ఏళ్లు అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతుందని చెప్పారు. ఒక సమర్థుడైన చంద్రబాబు నాయుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావడం సంతోషమని తెలిపారు.

చంద్రబాబు నాయుడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వాటన్నింటినీ పరిష్కరించి ముందుకు సాగాలని చెప్పారు. అత్యంత ముఖ్యమైన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులు పూర్తి కావాలని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని అన్నారు. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని చెప్పారు.

2 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది, మళ్లీ వైసీపీ ఘనవిజయం ఖాయం- వైఎస్ జగన్