Karnataka : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాకిచ్చిన గవర్నర్.. విచారణకు అనుమతి

సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో ..

Karnataka : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాకిచ్చిన గవర్నర్.. విచారణకు అనుమతి

Karnataka CM Siddaramaiah

Karnataka Governor Thawar Chand Gehlot : కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదరవుతున్నాయి. తాజాగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారణ చేసేందుకు గవర్నర్ శనివారం ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Also Read :  Sabarmati Express : సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కుట్ర జరిగిందా..? తృటిలో తప్పిన పెను ప్రమాదం

సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని కోరుతూ కొద్దివారాల క్రితం గవర్నర్ కు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : Kolkata Doctor Case : కోల్‌కతాలో పీజీ వైద్యురాలి ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్

గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయంతో రాజ్ భవన్, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరగనుంది. విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఈ సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు.

గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడంతో సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో రాజకీయంగా, న్యాయపరంగా, ప్రభుత్వం ఓవైపు దీన్ని ఎదుర్కొంటుంది. దీంతోపాటు సీఎం సిద్ధరామయ్య నైతికంగా రాజీనామా చేయాలని డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక తదుపరి రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయని చెప్పొచ్చు.