పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు : మంత్రి దుర్గేశ్

పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేశ్ హెచ్చరించారు.

పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు : మంత్రి దుర్గేశ్

Minister Kandula Durgesh

Minister Kandula Durgesh : పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేశ్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతోపాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ దస్త్రాలు తగలబడటం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉంది. స్వీపర్లు జీరాక్స్ కాపీలు, పనికి‌రావని తగలుబెట్టినట్లుగా అధికారులు‌ చెబుతున్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నాం.

Also Read : Divvala Madhuri : దువ్వాడ ఫ్యామిలీ ఫైట్.. సోషల్‌ మీడియాలో హీటెక్కిస్తున్న దివ్వెల మాధురి పోస్టులు

ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు బాక్సుల్లో భద్రపర్చాలి. కానీ, ఇక్కడ పనికిరావని తగలబెట్టడం వెనుక ఎవరి పాత్ర ఉందో విచారణ జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడింది. అవినీతి బయటపడుతుందనే ఆందోళనతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దుర్గేశ్ అన్నారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని జేసీ చెన్నరాయుడికి మంత్రి సూచించారు. పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.