రక్షాబంధన్ వేడుకలకు వెళ్తుండగా విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది మృతి

రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు తమ ఇళ్లకు వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరగడంతో 10మంది మృతి చెందగా..

రక్షాబంధన్ వేడుకలకు వెళ్తుండగా విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది మృతి

Road Accident

Updated On : August 18, 2024 / 2:21 PM IST

Road Accident in UP : రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు తమ ఇళ్లకు వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరగడంతో 10మంది మృతి చెందగా.. మరో 25మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌లోని సేలంపూర్-బదౌన్ రహదారిపై బస్సు కూలీలతో వెళ్తున్న వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read : Hyderabad : ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం..

సమాచారం ప్రకారం.. ఘజియాబాద్ లోని బ్రెడ్ కంపెనీలో పనిచేస్తున్న 35 మందికిపైగా కార్మికులు రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఘజియాబాద్ నుంచి వ్యాన్ లో అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్ లోని రాయ్ పూర్ గ్రామానికి వెళ్తున్నారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగానే వేగంగా వచ్చిన బస్సు కూలీలతో వెళ్తున్న వ్యాన్ ను బలంగా ఢీకొట్టింది.

Also Read : పాక్‌ అండతో రెచ్చిపోతున్న ఉగ్రవాద గుంపులు.. అసెంబ్లీ ఎన్నికల ముందు అలజడి సృష్టించే ప్లాన్

ప్రమాదం జరగడంతో పది మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.