ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించిన కేంద్ర సర్కారు

ఎన్డీఏ పార్టీల నుంచి కూడా ఒత్తిడి రావడంతో కేంద్ర సర్కారు వెనక్కి తగ్గింది.

ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించిన కేంద్ర సర్కారు

UPSC

Lateral Entry: లేటరల్ ఎంట్రీ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. యూపీఎస్సీ చైర్మన్‌కు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ లేఖ రాశారు. లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అప్పట్లో చేసిన సిఫార్సుల మేరకు లేటరల్ ఎంట్రీ విధానాన్ని తీసుకొచ్చారు. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన పదవుల్లో ఆయా రంగాల నిపుణులు ఉంటారు.

యూపీఏ హయాం నుంచి ఇది అమలవుతోంది. అయితే, యూపీఎస్సీ తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‍‌ ద్వారా పెద్ద ఎత్తున నియామకాలకు ప్రయత్నం జరిగింది. ఈ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రిజర్వేషన్లను తొలగించాలని, బ్యాక్ డోర్ ద్వారా నియామకాలు చేయాలని భావిస్తున్నారని విమర్శలు వచ్చాయి.

ఎన్డీఏ పార్టీల నుంచి కూడా ఒత్తిడి రావడంతో కేంద్ర సర్కారు వెనక్కి తగ్గింది. సామాజిక న్యాయం విషయంలో తన వైఖరిలో మార్పు లేదని, లేటరల్ ఎంట్రీ నియామకాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించాలని ప్రధాని ఆదేశించారు. ఆ మేరకు ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.

Also Read: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు