చంద్రబాబు తీరుమార్చుకోకపోతే.. భ‌విష్య‌త్‌లో తీవ్ర పరిణామాలుంటాయి : కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరిక

వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు.

చంద్రబాబు తీరుమార్చుకోకపోతే.. భ‌విష్య‌త్‌లో తీవ్ర పరిణామాలుంటాయి : కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరిక

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy : ఈవీఎం ధ్వంసం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు పిన్నెల్లి లాయర్లు చేరుకున్నారు. బెయిల్ పత్రాలను జైలులోని బెయిల్ బాక్స్ లో వేశారు. జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పిన్నెల్లి కొడుకు గౌతమ్, వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు. చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ పిన్నెల్లి పై మాత్రమే కేసు పెట్టారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

Also Read : మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు

పిన్నెల్లి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లి పోయారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాం. పిన్నెల్లి పై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతమవుతాయి. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే అధికారులు బలి పశువులవుతారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన కొడుకుతోపాటూ హైదరాబాద్ కు వెళ్ళిపోతారు. అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని కాకాణి అన్నారు.

వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు. కేసులు, అరెస్టులు, జైళ్ళకు భయపడం. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటాం. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.