పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.

Pinnelli Ramakrishna Reddy
pinnelli ramakrishna reddy bail: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఆయనకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాసుపోర్టు అప్పగించాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి, ఈవీఎం ధ్వంసం, పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై హత్యా ప్రయత్నం కేసులో ఆయనకు బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈవీఎం ధ్వంసంతో పాటు ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26న నరసరావుపేటలో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉంచారు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ గతంలో పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన జైలుపాలయ్యారు. కాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జూలై 4న జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు.
Also Read : మూడు వారాలు టైమ్ ఇస్తున్నాం.. అవసరమైతే నేనే వచ్చి ధర్నాచేస్తా : వైఎస్ జగన్