Mahesh Babu : సినిమాల్లోకి సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు వారసులు..!

టాలివుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో స్టార్ కిడ్స్ ఉన్నారు.

Mahesh Babu : సినిమాల్లోకి సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు వారసులు..!

Descendants of superstars into movies

Mahesh Babu kids : టాలివుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో స్టార్ కిడ్స్ ఉన్నారు. అందులో చాలామంది సూపర్ డూపర్ హిట్టయ్యారు. కొంతమంది తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటే.. ఇంకొంతమంది తల్లికి తగ్గ కూతుళ్లు అనిపించుకుంటున్నారు. హిట్ మూవీస్ తో దూసుకుపోతున్నారు. అలాగే ఇప్పుడు టాలివుడ్ లో మరో స్టార్ వారసుల ఎంట్రీకి అంతా రెడీ అవుతోంది. ఈసారి వచ్చేది అలాంటి ఇలాంటోళ్లు కాదు.. సూపర్ స్టార్ వారసులుండీ బాబు.

సూపర్ స్టార్ కృష్ణ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. నెక్స్ట్ సూపర్ స్టార్ గౌతమ్.. సూపర్ స్టార్ సితార.. అదేంటి అనుకుంటున్నారా. అదేమరి కిక్కంటె. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాంచి కిక్కిచ్చే అప్ డేట్ ఇచ్చింది సితార పాప. తనతో పాటు అన్నయ్య గౌతమ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సితార తన కెరీర్ గురించి.. ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటికే తాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నట్టు.. ఢిల్లీ, లండన్ వంటి పలుచోట్ల జరిగిన యాక్టింగ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు.. యాక్టింగ్ ఎగ్జామ్స్ లో సితార మంచి స్కోర్ సాధించిందట. మొత్తానికి భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు స్ట్రాంగ్ గానే చెప్పింది సితార.

‘ఖుషి 2’ పై హీరోయిన్ ప్రియాంక మోహన్ కీల‌క వ్యాఖ్య‌లు.. స్పందించిన‌ ఎస్‌జే సూర్య..

తన కెరీర్ ప్లానింగ్స్ గురించి చెబుతూనే.. అన్నయ్య గౌతమ్ గురించి కూడా సీక్రెట్ రివీల్ చేసింది సితార. మహేశ్ వారసుడిగా గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడొస్తడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అసలు వస్తాడా.. రాడా అనుకుంటున్నారట చాలామంది. ఐతే వాళ్లందరి డౌట్ ని సితార క్లియర్ చేసింది. గుడ్ న్యూస్ చెప్పింది.

అన్నయ్య గౌతమ్ కూడా యాక్టింగ్ నే తన కెరీర్ గా సెలెక్ట్ చేసుకున్నాడని.. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగేళ్ల యాక్టింగ్ కోర్సు చేసి.. ఆ తర్వాత పక్కాగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడట గౌతమ్. ఇక తాము యాక్టింగ్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు హ్యాపీగా ఫీలవుతున్నరని.. ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది సితార.

Suhas : యంగ్ హీరో సుహాస్ డేరింగ్ స్టెప్!

ఇప్పటికే సోషల్ మీడియాలో సితారకి మంచి ఫాలోయింగ్ ఉంది. నాలుగేళ్ల వయసు నుంచే డ్యాన్స్ కూడా నేర్చుకుంటోంది. ఒక జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా చేసింది. ఆమె హైలీ టాలెంటెడ్ స్కిల్స్ చూసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని చాలామంది ముందుగానే గెస్ చేశారు. ఐతే గౌతమ్ విషయంలోనే అభిమానులకు క్లారిటీ ఉండేదికాదు. ఇన్నాళ్లకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఫ్యూచర్ సూపర్ స్టార్ గౌతమ్ అంటూ మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట. సైలెంట్ గా కనిపించే గౌతమ్ సిల్వర్ స్క్రీన్ పై అచ్చం మహేశ్ లాగే మెస్మరైజ్ చేస్తాడని ఇప్పటి నుంచే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారట. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి అసలు సిసలైన వారసులు రాబోతున్నారు.. పిచ్చ క్లారిటీ వచ్చేసిందనుకుంటున్నారట చాలామంది.