Akkineni Nagarjuna : ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత పై తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన నాగార్జున‌..!

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

Akkineni Nagarjuna : ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత పై తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన నాగార్జున‌..!

Nagarjuna took refuge in the Telangana High Court over N Convention demolition

Updated On : August 25, 2024 / 3:32 PM IST

Nagarjuna – TG High Court : మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న‌ప్ప‌టికి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ నాగార్జున త‌రుపున న్యాయ‌వాది హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇదిలా ఉంటే.. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కూల్చివేత‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇప్ప‌టికే నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు.

Ravi Teja : ఆస్పత్రి నుంచి మాస్ మ‌హారాజా డిశ్చార్జ్‌.. ఆరోగ్యంగానే ఉన్నానంటూ ర‌వితేజ ట్వీట్‌

‘ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని.

తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Nag Ashwin : అర్ష‌ద్ వార్సీ కామెంట్ల‌పై స్పందించిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌.. ‘క‌ల్కి 2’లో ది బెస్ట్‌గా చూపిస్తా..