Triumph Daytona 660 : ట్రయంఫ్ డేటోనా 660 సరికొత్త బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Triumph Daytona 660 Launch : ట్రయంఫ్ సరికొత్త మోటార్‌సైకిల్ కార్నివాల్ రెడ్, శాటిన్ గ్రానైట్, స్నోడోనియా వైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు, డేటోనా 660 30కి పైగా అసలైన యాక్సెసరీలను పొందుతుంది.

Triumph Daytona 660 : ట్రయంఫ్ డేటోనా 660 సరికొత్త బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Triumph Daytona 660 launched in India ( Image Source : Google )

Triumph Daytona 660 Launch : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ట్రయంఫ్ ఇండియాలో సరికొత్త డేటోనా 660ని లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్-షోరూమ్), ట్రైడెంట్ 660, టైగర్ స్పోర్ట్ 660లో ఉన్న అదే ఇంజన్‌తో వస్తుంది. అయితే, డేటోనా 660 కొద్దిగా భిన్నమైన స్టేటస్ పొందుతుంది. డేటోనా 660 బైకులో 660సీసీ ఇన్‌లైన్ 3-సిలిండర్ మోటార్ 11,250rpm వద్ద 95bhp, 8,250rpm వద్ద 69Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రైడెంట్ టైగర్ స్పోర్ట్ కన్నా 14bhp, 5Nm బంప్, కానీ డేటోనా ట్రైడెంట్ కన్నా 12కిలోల బరువు, టైగర్ స్పోర్ట్ కన్నా 4కిలోగ్రామలు తేలికైనది.

Read Also : Realme 13 5G Series : రియల్‌మి 13 5జీ సిరీస్ చూశారా? ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

బైక్ సీటు ఎత్తు 810ఎమ్ఎమ్ వద్ద చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పైన పేర్కొన్న ఇంజిన్ ట్రయంఫ్ టార్క్ క్లచ్ అసిస్ట్ సిస్టమ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. డేటోనా 660 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు, 41ఎమ్ఎమ్ యూఎస్‌డీ షోవా ఫ్రంట్ ఫోర్క్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ షోవా రియర్ సస్పెన్షన్‌తో వస్తుంది. బ్రేకింగ్ డ్యూటీలు ఫ్రంట్ సైడ్ 310ఎమ్ఎమ్ డిస్క్ ద్వారా పనిచేస్తుంది. వైట్-ఆన్-బ్లాక్ ఎల్‌సీడీలో కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్ విలీనమైంది. డేటోనా 660 బైక్ ధర ట్రైడెంట్ 660 కన్నా రూ. 1.60 లక్షలు, టైగర్ స్పోర్ట్ కన్నా రూ. 27వేలు ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ట్రయంఫ్ సరికొత్త మోటార్‌సైకిల్ కార్నివాల్ రెడ్, శాటిన్ గ్రానైట్, స్నోడోనియా వైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు, డేటోనా 660 30కి పైగా అసలైన యాక్సెసరీలను పొందుతుంది. అదే రెండు ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీని కలిగి ఉంటుంది. ప్రత్యర్థుల విషయానికొస్తే.. ట్రయంఫ్ మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ కవాసకి నింజా 650, అప్రిలియా ఆర్ఎస్ 660లకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో 400సీసీ మోటార్ ఆధారంగా రెండు కొత్త మోడళ్లను తీసుకురావాలని ట్రయంఫ్ యోచిస్తోంది.

Read Also : WhatsApp Passkeys : వాట్సాప్‌లో ప్రైవసీ ఫీచర్.. పాస్‌కీలతో త్వరలో చాట్ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు..!