Balakrishna First Movie : బాలకృష్ణ మొదటి సినిమా రెండు నెలలు బ్యాన్ అయిందని తెలుసా? ఎందకంటే..?

బాలకృష్ణ మొదటి సినిమాకు ఇలా ఎన్నో కష్టాలు వచ్చాయి.

Balakrishna First Movie : బాలకృష్ణ మొదటి సినిమా రెండు నెలలు బ్యాన్ అయిందని తెలుసా? ఎందకంటే..?

Balakrishna First Movie Tatamma Kala Banned for Two Months before its Release

Balakrishna First Movie : యువరత్న, నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి తన నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తి కావడంతో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను సెప్టెంబర్ 1న తెలుగు పరిశ్రమ తరపున గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ తో పాటు సౌత్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు తరలి రానున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకపైనే ఉంది.

ఈ క్రమంలో బాలయ్య కెరీర్లోని పలు సంఘటనలు ప్రస్తుతమ వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ స్కూల్ లో ఉన్నప్పుడే ఎన్టీఆర్ సినిమా ‘తాతమ్మ కల’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని ఎన్టీఆర్ నిర్మిస్తూ డైరెక్షన్ చేసారు. 1974 లో ఈ సినిమా రిలీజయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా ఇబ్బందులు పడింది. రెండు నెలలు బ్యాన్ అయింది, సెన్సార్ ఇవ్వలేదు. బాలకృష్ణ మొదటి సినిమాకు ఇలా ఎన్నో కష్టాలు వచ్చాయి.

Also Read : Pawan Kalyan : ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

తాతమ్మ కల సినిమా రిలీజ్ సమయానికి దేశంలో కుటుంబ నియంత్రణ కోసం ఇద్దరు ముద్దు ఆపై వద్దు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో దానికి వ్యతిరేకంగా చూపించారు. ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది తల్లితండ్రుల ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం కాదు అని ఎన్టీఆర్ అనేవారు. దానికి తగ్గట్టు ఆ పాయింట్ ని కూడా ఈ సినిమాలో ప్రస్తావించడంతో అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్టీఆర్ పోరాడి అసెంబ్లీలో సైతం ఈ సినిమా గురించి చర్చ జరిగేలా చేసి ఈ సినిమాని రిలీజ్ చేయగలిగారు ఎన్టీఆర్. తాతమ్మ కల 1974 ఆగస్టు 30న రిలీజయింది. ఈ సినిమా రిలీజయి నేటికి 50 ఏళ్ళు. బాలయ్య మొదటిసారి కెమెరా ముందు ఈ సినిమాలోనే మనవడి పాత్రలో కనపడి అలరించారు. ఈ సినిమాలో హరికృష్ణ కూడా నటించారు. ఈ సినిమాకు ఉత్తమ కథా రచయితగా ఎన్టీఆర్‌కు నంది అవార్డు రావడం గమనార్హం.