Ather Energy : ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. ప్రమాదాన్ని పసిగట్టే టెక్నాలజీ..!

Ather Energy : అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలతో ద్విచక్ర వాహన విభాగంలో భద్రత కోసం ఏథర్ ఎనర్జీ సరికొత్త ప్రమాణాలను తీసుకువచ్చింది.

Ather Energy : ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. ప్రమాదాన్ని పసిగట్టే టెక్నాలజీ..!

Ather Energy Pioneers Advanced Safety Features in Electric Two-Wheelers ( Image Source : Google )

Ather Energy : భారత ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేస్తోంది. అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలతో ద్విచక్ర వాహన విభాగంలో భద్రత కోసం ఏథర్ ఎనర్జీ సరికొత్త ప్రమాణాలను తీసుకువచ్చింది.

దేశీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు 2022 నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాలలో దాదాపు 45శాతం ద్విచక్ర వాహనాలతో సంబంధం కలిగి ఉన్నాయి. అందుకే, రైడర్ భద్రత కోసం ఏథర్ గతంలో కంటే చాలా కీలకమైన భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Infinix Hot 50 5G : భలే ఉంది భయ్యా.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

సాంప్రదాయకంగా, ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS), అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) వంటి ఫీచర్‌లతో రోడ్డు భద్రతలో కార్లు ముందున్నాయి. భద్రతా పరంగా ద్విచక్ర వాహన విభాగంలో ఏబీఎస్, అడ్వాన్స్‌డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ARAS) వంటి భద్రతా ఆవిష్కరణలు ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఆలస్యంగా ప్రవేశపెట్టారు. ఏథర్ ఎనర్జీ అధునాతన భద్రతా ఫీచర్లు నేరుగా ఈవీ స్కూటర్‌లలోకి ప్రవేశపెట్టింది.

అయితే, ఏథర్ ఈవీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా నిరంతరం యాక్టివ్ అవుతుంటాయి. రైడర్‌లు లేటెస్ట్ సెక్యూరిటీ ఆవిష్కరణల నుంచి ప్రయోజనం పొందేలా చేస్తాయి. ఏథర్ సేఫ్టీ సూట్‌లోని ప్రత్యేక ఫీచర్లలో ఒకటి స్కిడ్ కంట్రోల్.. కంకర, నీరు లేదా ఇసుక వంటి ఉపరితలాలపై స్కిడ్డింగ్‌ కాకుండా నివారిస్తుంది. మోటర్ టార్క్‌ను పర్యవేక్షించి ఎడ్జెస్ట్ చేసే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. అదనంగా, ఏథర్ ఫాల్ సేఫ్ సిస్టమ్ స్కూటర్ ఆటోమేటిక్‌గా మోటర్‌కు పవర్‌ను కట్ చేసి వెంటనే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రియల్ టైమ్ సెక్యూరిటీ అందించే టెక్నాలజీతో రూపొందించారు. ఉదాహరణకు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) అధిక వేగంతో ఆకస్మిక స్టాప్‌ల సమయంలో ఫ్లాషింగ్ లైట్లను యాక్టివ్ చేస్తుంది. ప్రమాదం గురించి ఇతర డ్రైవర్‌లను హెచ్చరిస్తుంది. థెఫ్ట్ అండ్ టో డిటెక్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్‌లు భద్రతను అందిస్తాయి. ఈవీ టెక్నాలజీతో ఏథర్ స్కూటర్‌లను మరింత సురక్షితమైనవిగా మారుస్తుంది. భారతీయ రైడర్‌లకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది.

Read Also : Reliance Jio Anniversary : రిలయన్స్ జియో జైత్రయాత్రకు 8 ఏళ్లు.. భారత్‌లో 73 రేట్లు పెరిగిన డేటా వినియోగం!