పండుగ వేళ.. గేమ్ చేంజర్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది..

చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్‌కి కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

పండుగ వేళ.. గేమ్ చేంజర్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది..

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ ను ఈ నెలలోనే విడుదల చేస్తామని చెప్పారు. చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్‌ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. చరణ్ తలకి ఎర్ర కండువా కట్టుకుని కనపడడం గమనార్హం. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ అప్‌డేట్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ సాంగ్ అందరినీ అలరించింది. ఈ పాట లిరిక్స్ తో పాటు అందులో చూపించిన విజువల్స్ అదరహో అనిపించాయి. సెకండ్ సింగిల్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు.

శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. ఈ మూవీ షూటింగ్ మొదలై చాలా కాలం అవుతోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమా యూనిట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది.

శంకర్, కమల్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ 2 సినిమా ప్లాప్ అయింది. దీంతో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై శంకర్ మరింత శ్రద్ధ పెట్టి తీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : ఓటీటీలోకి నార్నె నితిన్ ‘ఆయ్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే..