ఎనిమిది రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు: మల్లాది విష్ణు

వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

ఎనిమిది రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు: మల్లాది విష్ణు

YCP MLA Malladi Vishnu

వరదలు వచ్చి ఎనిమిది రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాలమే సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నట్టుగా ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 28న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో వరదల గురించి కనీసంగా కూడా చర్చించలేదని, తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఘోర వైఫల్యం చెందారని చెప్పారు. వరదలు వచ్చి లక్షన్నర మంది గ్రౌండ్ ఫ్లోర్‌లోని వారు మునిగిపోతే పట్టించుకోలేదని, జగన్‌ని విమర్శించటమే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు.

రెండు లక్షలమందిని తరలించలేకపోతే కనీసం అలర్ట్ చేస్తే వారే వెళ్లిపోయేవారు కదా అని ప్రశ్నించారు. అదికూడా చేయకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యారని అన్నారు. పది రోజులుగా మురుగు నీరు నిల్వ ఉంటే పట్టించుకోవటం లేదని చెప్పారు. పారిశుధ్యం దారుణంగా మారిందని, సహాయక చర్యల్లో వేగం పెంచాలని డిమాండ్ చేశారు.

 Also Read: ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపుపై కన్నయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..