iPhone 15 Pro Price : ఐఫోన్ 16 లాంచ్‌కు ముందు ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

iPhone 15 Pro Price Drop : ఆపిల్ ప్రస్తుత ప్రీమియం ఐఫోన్ 15 ప్రో వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.

iPhone 15 Pro Price : ఐఫోన్ 16 లాంచ్‌కు ముందు ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

Apple iPhone 15 Pro gets price drop ahead of iPhone 16 launch

iPhone 15 Pro Price Drop : ఆపిల్ ఐఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లో టైమ్ ఈవెంట్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. టెక్ దిగ్గజం సెప్టెంబర్ 9న రాత్రి 10:30 (భారత కాలమానం ప్రకారం) కొత్త ఐపోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్, 10, ఎయిర్ పాడ్స్ 4 మరిన్నింటిని ఆవిష్కరించనుంది.

ఈ బిగ్ ఈవెంట్‌కు ముందు, ఆపిల్ ప్రస్తుత ప్రీమియం ఐఫోన్ 15 ప్రో వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. గత ఏడాది ఫ్లాగ్‌షిప్‌ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం. ఇంతకీ ఈ ఐఫోన్ 15 ప్రో సిరీస్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

Read Also :Apple Glowtime Launch Event : ఆపిల్ గ్లోటైమ్ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ నుంచి మొత్తం 4 మోడల్స్.. ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రో మోడల్ 128జీబీ స్టోరేజ్, బ్లాక్ టైటానియం కలర్‌తో రూ. 1,39,900గా లిస్టు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సస్ క్రెడిట్ కార్డ్ ఉన్న (BNut) వినియోగదారులు అదనంగా రూ. 6,990 తగ్గింపును పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 15ప్రో ధర రూ. 1,32,810కి తగ్గుతుంది. ఇంకా, వినియోగదారులు ట్రేడ్ చేయాలనుకుంటున్న డివైజ్‌ని బట్టి రూ. 46,350 వరకు క్యాష్‌బ్యాక్ ,ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. అమెజాన్‌లో ఐఫోన్ 15ప్రో మోడల్ 128జీబీ, బ్లాక్ టైటానియం రూ. 1,24,200 ఆకర్షణీయమైన ధరకు అందిస్తోంది. అదనపు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్షేంజ్ డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

విజయ్ సేల్స్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఐఫోన్లపై భారీగా ధరలను తగ్గించింది. ఐఫోన్ 15 ప్రో 128జీబీ వైట్ టైటానియం రూ. 1,21,490కి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని వాడితే రూ. 4,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అదే క్రోమాలో ఐఫోన్ 15 ప్రో 128జీబీ, నేచురల్ టైటానియం ధర రూ. 1,29,800కు అందిస్తోంది. కొనుగోలుదారులు ట్రేడింగ్ చేస్తున్న ఫోన్ వాల్యూను బట్టి ధర రూ. 1,10,330 వరకు డిస్కౌంట్ ఆఫర్‌ పొందవచ్చు.

ఐఫోన్ 15ప్రో మోడల్ నిలిపివేయనుందా? :
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లను నిలిపివేసే అవకాశం ఉంది. గత ఏడాదిలో మాదిరిగా ప్రీమియం ఫోన్లను దశలవారీగా తగ్గించే సంప్రదాయాన్ని ఆపిల్ కొనసాగిస్తుంది. ఆపిల్ సాధారణంగా ప్రో మోడల్‌లను లాంచ్ చేసిన ఒక ఏడాది తర్వాత దాని ప్రొడక్టుల రేంజ్ క్రమబద్ధీకరించడం, లేటెస్ట్ జనరేషన్ ఫోన్లను మార్కెట్లో విస్తరించడానికి పాత మోడళ్లను నిలిపివేస్తుంది.

ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను దాదాపు కంపెనీ నిలిపివేసినట్టే. అయినప్పటికీ, ఈ ఐఫోన్ మోడల్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, ఆపిల్ నుంచి సపోర్టును పొందుతాయని గమనించడం ముఖ్యం. అదనంగా, కస్టమర్‌లు ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లను థర్డ్-పార్టీ రిటైలర్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టోర్‌ల నుంచి ఇప్పటికే ఉన్న స్టాక్‌లు అయిపోయే వరకు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఐఫోన్ 15 ప్రోపై డిస్కౌంట్.. కొనాలా వద్దా? :
ఐఫోన్ 15 ప్రో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌. ఈ ఫోన్‌లో ప్రీమియం టైటానియం బిల్డ్, పవర్‌ఫుల్ A17 ప్రో చిప్, 7 ప్రో లెన్స్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్, ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీతో టెక్ దిగ్గజం ఐపోన్ 16 సిరీస్‌లో అందించనుంది. ఐఫోన్ 15 ప్రో లైనప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు (FOMO)ని యాక్సస్ చేయలేరు. మీరు ఆపిల్ లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్, ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఈ ఐఫోన్ 15ప్రో డిస్కౌంట్‌తో కొనకపోవడమే బెటర్..

Read Also : iPhone 16 Pro Price : ఆపిల్ బిగ్ ఈవెంట్‌కు ముందే లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో ధర వివరాలు లీక్..!