Ganesha Nimajjanam: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం వి (Vi) వాహనాలు

స్థానికులు తమ ఇంటి వద్దే సురక్షితంగా, పర్యావరణహితంగా నిమజ్జనం చేసుకునేందుకు ఈ వాహనాల్లో ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేశారు. వి

Ganesha Nimajjanam: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం వి (Vi) వాహనాలు

వినాయక చవితి పండుగ సందర్భంగా సంస్కృతి/ధార్మిక ఆచారాలను పాటిస్తూనే పర్యావరణహితమైన విధంగా నిమజ్జనాన్ని జరుపుకోవాలని కోరుకునే భక్తుల ఆకాంక్షలను తీర్చేందుకు వి (Vi) తోడ్పాటు అందించనుంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన నిమజ్జనం ట్యాంకుతో తీర్చిదిద్దిన వి వాహనాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీల వద్దకు వస్తాయి.

కూకట్‌పల్లి, కుషాయ్‌గూడా, ఏఎస్ రావు నగర్, సనత్ నగర్, మూసాపేట్, కొండాపూర్, మదీనాగూడా, చందా నగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, కొంపల్లి, హయత్‌నగర్, సుచిత్ర, ఎల్‌బీ నగర్, మియాపూర్, తిరుమల్‌గిరి మొదలైన ప్రాంతాల వద్దకు ఆ వాహనాలు వస్తాయి.

స్థానికులు తమ ఇంటి వద్దే సురక్షితంగా, పర్యావరణహితంగా నిమజ్జనాన్ని నిర్వహించేందుకు ఈ వాహనాల్లో ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేశారు. విషపూరితమైన పెయింట్స్, మట్టి మొదలైనవి పేరుకుపోవడం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా, చెరువులు వంటి వాటిల్లోని జీవరాశులకు హాని కలగకుండా ఉండేలా చూసేందుకు, అలాగే నిమజ్జనం కోసం రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లే అవసరాన్ని తగ్గించేందుకు ఈ చొరవ తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా వొడాఫోన్ ఐడియా క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఏపీ, తెలంగాణ, కర్ణాటక) ఆనంద్ దాని మాట్లాడుతూ.. పండుగలను సంతోషంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఒక బ్రాండ్‌గా వి విశ్వసిస్తుందని అన్నారు. పండుగ వేడుకల్లో తామూ పాలుపంచుకుంటున్నామని, అదే సమయంలో నిమజ్జనంతో పర్యావరణంపై పడే ప్రభావం గురించి కూడా తమకు అవగాహన ఉందని తెలిపారు.

ప్రస్తుతం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరిగిందని, చెరువుల్లాంటివి కలుషితం గాకుండా చూసేందుకు పౌరులంతా ఇంటి దగ్గరే నిమజ్జనం చేపట్టాలంటూ ప్రభుత్వం కూడా కోరుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూలమైన విధంగా గణేశ నిమజ్జనం చేయడంలో ప్రజలకు తోడ్పాటు అందించే దిశగా వి ఒక అర్థవంతమైన ముందడుగు వేస్తోందని తెలిపారు. స్వచ్ఛమైన, హరిత హైదరాబాద్‌ను ప్రమోట్ చేయడంలో భాగం కావాలని తాము ప్రజలను కోరుతున్నామన్నారు.

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ