హైదరాబాద్‌లో నా స్థలంలో ‘హైడ్రా’ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా: మాజీ ఎమ్మెల్యే కాటసాని

తనకు చెందిన స్థలంలో వాచ్‌మన్ గది, కాంపౌండ్ వాల్ మాత్రమే ఉన్నాయని చెప్పారు.

హైదరాబాద్‌లో నా స్థలంలో ‘హైడ్రా’ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా: మాజీ ఎమ్మెల్యే కాటసాని

Katasani Ramabhupal Reddy

Updated On : September 8, 2024 / 9:32 PM IST

Katasani Ramabhupal Reddy: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్న వేళ కర్నూలు జిల్లాలోని పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తన స్థలంలో హైడ్రా కూల్చివేతలపై నోటీసులు ఇవ్వనందుకు న్యాయస్థానానికి వెళ్తానని చెప్పారు.

తనకు నోటీసులు ఇవ్వకుండా కాంపౌండ్ వాల్స్, వాచ్‌మన్ గదిని కూల్చి వేశారని తెలిపారు. తన స్థలం నిబంధనల మేరకే ఉందని, అయినప్పటికీ చర్యలు తీసుకోవడం ఏంటని అన్నారు. తనకు చెందిన స్థలంలో వాచ్‌మన్ గది, కాంపౌండ్ వాల్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. వైసీపీలో ఉండడంతో తనపై మీడియాలో తప్పుడుగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.

తనపై తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. తాను తప్పు చేస్తేనే అటువంటి వార్తలు రాయాలని, అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకూడదని చెప్పారు. కాగా, భూమా అఖియాలప్రియ రెడ్ బుక్ అంటూ చేసిన వాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.

Also Read: ఎనిమిది రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు: మల్లాది విష్ణు