Pink Power Run : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ.. సెప్టెంబర్ 29న ‘పింక్ ఫర్ రన్‌’

సుధారెడ్డి ఫౌండేషన్, ఎం.ఇ.ఐ.ఎల్(MEIL) ఫౌండేషన్ లు సామాజిక సేవతో పాటు సహకారం అందించటంలో ఎల్ల‌ప్పుడూ ముందుంటాయి.

Pink Power Run : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ.. సెప్టెంబర్ 29న ‘పింక్ ఫర్ రన్‌’

Sudha Reddy Foundation Meil Foundation To Organize Pink Power Run 2024

Pink Power Run : సుధారెడ్డి ఫౌండేషన్, ఎం.ఇ.ఐ.ఎల్(MEIL) ఫౌండేషన్ లు సామాజిక సేవతో పాటు సహకారం అందించటంలో ఎల్ల‌ప్పుడూ ముందుంటాయి. తాజాగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన క‌ల్పించేందుకు ఈ రెండు సంస్థ‌లు సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. ‘పింక్ పవర్ రన్ 2024’ పేరుతో సెప్టెంబర్ 29వ తేదీన కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని.. క్యాన్సర్ పై చేసే పోరాటంలో ఐక్యతను ప్రదర్శించాలని రెండు ఫౌండేషన్లు కోరాయి.

మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పింక్ పవర్ రన్‌ను ప్రారంభించినట్లు సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ సుధారెడ్డి తెలిపారు. తొలి ఎడిషన్‌లో భాగంగా 3k, 5k, 10k రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్ల‌డించారు.

హైడ్రా దూకుడు.. ఇప్పటివరకు ఎన్ని అక్రమ కట్టడాలు కూల్చేశారంటే..

ఈ పింక్ మారథాన్ లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక రేస్ కిట్లు, పోషకాహారం అందజేయ‌నున్నారు. అంతే కాకుండా రేస్ కు ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను కూడా చెబుతారు. రేసును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వారికి మెడల్స్ అంద‌జేస్తారు.

ఈ కార్యక్రమంలో వేలాది మందిని భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. పిల్లల నుంచి నుండి పెద్దల వరకు ఉండేలా చూడనున్నారు. గులాబీ రంగు దుస్తులను ధరించి పక్షి రూపంలో భారీ మానవహారాన్ని ప్రదర్శించనున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్షిరూప మానవహారం అనేది ఐక్యతా, ఆశ, బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాడే విషయంలో నిబద్ధతకు సంకేతమని నిర్వాహకులు తెలిపారు.