ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్‌-5లో రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే.. కోహ్లీ, జైస్వాల్ ఎక్క‌డంటే?

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్‌లు త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకున్నారు.

ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్‌-5లో రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే.. కోహ్లీ, జైస్వాల్ ఎక్క‌డంటే?

ICC Test Rankings Rohit Sharma returns to top 5 ahead of Bangladesh series

ICC Test Rankings : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్‌లు త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకున్నారు. రోహిత్ శ‌ర్మ ఓ స్థానం మెరుగు పర‌చుకుని 751 రేటింగ్ పాయింట్ల‌తో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్ర‌మంలో టెస్టు, వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో ఉన్న ఏకైక బ్యాట‌ర్ హిట్‌మ్యానే కావ‌డం గ‌మ‌నార్హం.

అటు కోహ్లీ, జైస్వాల్ లు ఒక్కొ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని వ‌రుస‌గా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. కొన్నాళ్లుగా టీమ్ఇండియా ఎలాంటి టెస్టు మ్యాచులు ఆడ‌కున్నా కూడా వీరి ర్యాంకులు మెరుగుప‌డ‌డం గ‌మ‌నార్హం. అటు ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచులో సెంచ‌రీ చేసిన శ్రీలంక బ్యాట‌ర్ పాథుమ్ నిస్సాంక ఏకంగా 42 స్థానాలు ఎగ‌బాకి 39వ స్థానంలో నిలిచాడు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోరూట్ అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతున్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ జిమ్ వీడియో వైర‌ల్‌.. 99 శాతం వ‌ర్కౌట్లు.. 1 శాతం మాత్రం..

ఐసీసీ టెస్టు టాప్‌-5 బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..

జో రూట్ (ఇంగ్లాండ్‌) – 899 రేటింగ్ పాయింట్లు
కేన్ విలియ‌మ్స‌న్ (న్యూజిలాండ్‌) -859 రేటింగ్ పాయింట్లు
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) – 768 రేటింగ్ పాయింట్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) -757 రేటింగ్ పాయింట్లు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 751 రేటింగ్ పాయింట్లు

బౌలర్ల ర్యాంకింగ్స్‌..

బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో పెద్ద‌గా మార్పులు లేవు. భార‌త స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్‌తో క‌లిసి జ‌స్‌ప్రీత్ బుమ్రా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ర‌వీంద్ర జ‌డేజా ఏడు, కుల్దీప్ యాద‌వ్ 15వ స్థానంలో ఉన్నాడు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. ష‌మీ, శ్రేయ‌స్‌కు నో ఛాన్స్‌.. ఎందుకంటే..?

ఐసీసీ టెస్టు టాప్‌-5 బౌల‌ర్ల‌ ర్యాంకింగ్స్‌..
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్) – 870 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 847 రేటింగ్ పాయింట్లు
జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 847 రేటింగ్ పాయింట్లు
పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 820 రేటింగ్ పాయింట్లు
క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 820 రేటింగ్ పాయింట్లు

ఇదిలా ఉంటే.. భార‌త జ‌ట్టు ఆరు నెల‌ల విరామం త‌రువాత టెస్టులు ఆడ‌బోతుంది. సెప్టెంబ‌ర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌తోనే టెస్టుల్లో రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మొద‌టి టెస్టు మ్యాచ్ చెన్నైలో సెప్టెంబ‌ర్ 19 నుంచి 23 వ‌ర‌కు, రెండో టెస్టు మ్యాచ్‌లో కాన్పూర్‌లో సెప్టెంబ‌ర్ 27 నుంచి అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.