యుద్ధం చేస్తే మోడీ ఓడిపోతారు : చంద్రబాబు జోస్యం

కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్‌కు అనుకూలంగా

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 12:51 PM IST
యుద్ధం చేస్తే మోడీ ఓడిపోతారు : చంద్రబాబు జోస్యం

కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు… ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్‌కు అనుకూలంగా

కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు… ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడినట్టు  దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. నెంబర్ వన్ దేశభక్తిలో టీడీపీ కార్యకర్తలు ముందుంటారని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు యుద్ధం చేస్తే ఓట్లొస్తాయా?  అని ప్రధాని మోడీని ఉద్దేశించి చంద్రబాబు నిలదీశారు. పుల్వామా దాడి జరిగిందంటే మోడీ సర్కార్ వైఫల్యం కాదా అని అడిగారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నోట్ల  రద్దు నిర్ణయం ఎన్నికలకు ఉపయోగపడింది తప్ప పేదవాళ్లకు కాదని చంద్రబాబు విమర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. మోడీ దాడికి నేను భయపడను అని చంద్రబాబు అన్నారు.

సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులు కోడుమూరులో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతిపక్షాలపై నిప్పులు  చెరిగారు. వైసీపీ అధినేత జగన్‌కు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని చంద్రబాబు అన్నారు. జగన్, మోడీ, కేసీఆర్ కలిసి రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

విశాఖ రైల్వే జోన్ గురించి వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తమ రాజకీయాలు తెలంగాణలో చేసుకోవాలన్నారు. పద్దతి లేని రాజకీయాలు చేస్తే సహించేదని లేదన్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమని, గుణపాఠం చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు.