Kcr : కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం

కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది.

Kcr : కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం

Kcr : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది.

కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. ఈరోజు(మే 1) రాత్రి 8 గంటల నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ప్రచారం నిర్వహించవద్దని కేసీఆర్ ను ఆదేశించింది ఈసీ. ఏప్రిల్ 5న సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.

కాంగ్రెస్ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. ఏప్రిల్ 16న కేసీఆర్ కు నోటీసులు పంపింది. నోటీసులకు ఏప్రిల్ 23న కేసీఆర్ రిప్లయ్ ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలను తప్పుపట్టాను తప్ప.. వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్.. 48గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దని నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉండగా.. కేసీఆర్ పై ఈసీ నిషేధం విధించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : నన్ను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు