Chilli Cultivation : మిరపలో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి
మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు లక్షరూపాయలు దాటుతోంది. సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే , అడుగడుగునా ఎదురయ్యే చీడపీడలను అధిగమించటం రైతుకు పెద్ద చాలెంజ్ గా మరింది.

Chilli Cultivation
Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్యపంట మిరప. దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 20 వేల హెక్టార్లలో సాగవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల బాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషివిజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్, డా. జె.హేమంత్ కుమార్.
ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాటిన మిరప తోటలు 15 నుండి 45 రోజుల దశలో ఉన్నాయి. అయితే వరుసగా కురిసిన వర్షాలకు తోటల్లో నీరు నిలవడం, వాతావరణం మబ్బుగా ఉండటం వల్ల చాల చోట్ల బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఈ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. సకాలంలో గుర్తించి ఆకుమచ్చ తెగులును అరికడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం , కో ఆర్డినేటర్ డా. జే. హేమంత్ కుమార్.
READ ALSO : Ganesh Chaturthi 2023 : సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి .. ఇలా చెవిలో చెబితే అలా రాసేసుకుంటాడట..
మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు లక్షరూపాయలు దాటుతోంది. సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే , అడుగడుగునా ఎదురయ్యే చీడపీడలను అధిగమించటం రైతుకు పెద్ద చాలెంజ్ గా మరింది. సకాలంలో చీడపీడలను గుర్తించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనల ప్రకారం సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను పొంది రైతు ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడు.