Ganesh Chaturthi 2023 : సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి .. ఇలా చెవిలో చెబితే అలా రాసేసుకుంటాడట..

కైలాసంలో శివుడికి సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి. చెవిలో చెబితే రాసుకుని తండ్రికి సాక్ష్యమిచ్చే గణపతి దేవాలయం విశిష్టత.

Ganesh Chaturthi 2023 : సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి .. ఇలా చెవిలో చెబితే అలా రాసేసుకుంటాడట..

sakshi ganapati

Ganesh Chaturthi 2023 : జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండు కొలువైన పరమపవిత్ర క్షేత్రం శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లిఖార్జున స్వామిగా అమ్మవారు భ్రమరాంభదేవిగా పూజలందుకుంటున్నారు.18 శక్తిపీఠాలలో శ్రీలం భ్రమరాంభదేవి దేవాలయం ఓ శక్తిపీఠంగా వెలుగొందుతోంది. పరమశివుడి వాహనం నంది పర్వుతుడిగా వెలియగా ఆ పర్వతంపై పరమశివుడు జ్యోతిర్లింగంగా కొలువయ్యాడు. నల్లమల అడవుల్లో అత్యంత రమణీయమైన ప్రకృతి ఒడిలో పరమశివుడు మల్లికార్జునస్వామిగా కొలువైన శ్రీశైల మన్నల్ల దేవాలయానికి సమీపంలో ప్రసిద్ద క్షేత్రంలో వెలిసాడు గణపతి. ఈయనే సాక్షి గణపతిగా పూజలందుకుంటున్నాడు. తన తండ్రి శివుడికి సాక్ష్యాలు చెప్పే గణపతి కాబట్టి సాక్షి గణపతి అనే పేరు వచ్చింది.

Ganesh Chaturthi 2023 : గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారంటే?

ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి అయినా ఈ గణపతిని దర్శించుకోవాలని చెబుతుంటారు. ప్రతీ భక్తుడు శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నాక ఈ గణపతిని దర్శించుకోవాలి. అలా తాను మల్లిఖార్జునుడి దర్శించుకున్నానని గణపతి చెవిలో చెప్పాలి. అలా భక్తులు చెప్పగానే గణపతి తన ఘట్టంతో రాసుకుని కైలాసంలో శివుడికి సాక్ష్యమిస్తాడట. అందుకే సాక్షి గణపతిగా పేరొందాడు. ఇక్కడ గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిమలో కూర్చొని ఉంటుంది. అంటే భక్తులు తన చెవిలో చెప్పే విషయాన్ని రాసుకుని కైలాసంలో తన తండ్రి శివుడికి సాక్ష్యమిస్తాడట.

Ganesh Chaturthi 2023 : భూగర్భంలో బొజ్జ గణపయ్య .. చెవిలో చెబితే కోరికలు తీర్చే స్వామి

అంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాసా ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారు. ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినదని అంటారు.