Tamara Worm In Chili : మిరప రైతులను కలవరపెడుతున్న తామర పురుగు! నివారణ మార్గాలు
మొక్కలు నాటిన తరువాత 10 నుండి15 రోజులకు ఒకసారి బవేరియా బాసియన మరియు వర్తిసెల్లము కలిపి సాయంత్రం స్ప్రే చేసుకోవాలి. విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రెక్ డెర్మ విరుడి, సూడో మోనాస్ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని వెదజల్లి బెడ్ కట్టుకోవాలి.

Tamara Worm In Chili : మిరప పండించే రైతులను తామర పురుగు కలవరపెడుతోంది. సాధారణంగా పురుగులు ఆకుల్లోని రసం పీలుస్తాయి. కానీ ఈ కొత్త రకం పురుగు మాత్రం పువ్వుల్లోని పుప్పొడిని సైతం పీల్చి పూత, కాత లేకుండా చేస్తుంది. తామర పురుగు అనేది ఎటువంటి కెమికల్ మందులకు లొంగదు కానీ నివారించేందుకు మన పాత వ్యవసాయ విధానం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపు రంగు, నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 40 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని, చెట్టుపై కాకుండా నేలపై ఫిప్రోనిల్ గుళికలు వాడాలని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతానికి స్పైనోస్పాడ్ లేదా ఎసిటామిప్రైడ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ వంటి మందులు లీటరుకు 3 గ్రాముల వేప కషాయాన్ని కలిపి వాడుకోవాలి. వాటిని మార్చి మార్చి పిచికారీ చేయాలి. పొలంలో చెత్తను ఎండకాలం కాల్చకుండా 0 కాంపోస్ బ్యాక్టీరియాను వాడి కుళ్లబెట్టాలి అప్పుడు కార్బన శాతం నేలలో పెరుగుతుంది.
మొక్కలు నాటిన తరువాత 10 నుండి15 రోజులకు ఒకసారి బవేరియా బాసియన మరియు వర్తిసెల్లము కలిపి సాయంత్రం స్ప్రే చేసుకోవాలి. విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రెక్ డెర్మ విరుడి, సూడో మోనాస్ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని వెదజల్లి బెడ్ కట్టుకోవాలి. పొలం చుట్టూ ఆవల మొక్కలు కానీ లేదా బంతి పూల మొక్కలు వేయాలి.
జిగురు అట్టలు, బుట్టలు పెట్టాలి. పకి స్థావరలు పెట్టాలి. ఎప్పుడు తేమ ఉండేలా కాకుండా ప్లాన్ చేయాలి. యూరియాను సాధ్యమైన వరకు తగ్గించాలి. హై డెన్సిటిలో మొక్కలు నాటకుడదు. సూక్ష్మ పోషకాలు అందివ్వాలి. నారును కొనకుండా పెంచుకోవడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే తామర పురుగు ఉధృతిని తగ్గించి పంటను కాపాడుకోవచ్చు.