Cultivation of Vegetables : ఖరీఫ్ లో వరి సాగు.. రబీలో కూరగాయల సాగు

ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో  బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది. మూడున్నర నెలల వరకు పంట చేతికి వస్తుంది.

Cultivation of Vegetables : ఖరీఫ్ లో వరి సాగు.. రబీలో కూరగాయల సాగు

Cultivation of vegetables

Cultivation of Vegetables : కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకోగలగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా….స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంటగా బెండ  రైతుల ఆదరణ పొందుతోంది. అందుకే ప్రతి ఏటా బెండసాగుచేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు.

READ ALSO : Andhra Politics: త్రిశూల వ్యూహంతో కాకపుట్టిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేశ్!

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు ఖమ్మం జిల్లా, వెంకటాపురం మండలానికి చెందిన యువ రైతు ఎస్.కె. అన్వర్. సంప్రదాయ పంటల సాగుతో పెద్దగా లాభం లేదని గుర్తించిన ఆయన 15ఏళ్లుగా కూరగాయల సాగుపైనే ప్రత్యేకంగా దృష్టిసారించి తనకున్న రెండు ఎకరాలను ఇందుకోసం కేటాయించారు.

READ ALSO : Shoulder Pain : మహిళల్లో భుజం నొప్పికి కారణమయ్యే కారకాలు.. పోషకాహరం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు ?

ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో  బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది. మూడున్నర నెలల వరకు పంట చేతికి వస్తుంది. కోసిన ప్రతి సారి క్వింట దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన దిగబడిని స్థానిక మార్కెట్ లో  అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.