Diseases of Cattle : వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు

కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడి కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టతరంగా మారుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీల్చుకోవటానికి ఇబ్బందిపడుతుంది.

Diseases of Cattle : వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు

Diseases of cattle

Updated On : August 21, 2023 / 10:26 AM IST

Diseases of Cattle : వర్షకాలంలో వాతావరణంలో వచ్చే మార్పులతో పశువుల్లో వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి పశువులను కాపాడుకోవాలి. వర్షాకాలంలో పరిసరాల అపరిశుభ్రత, వరద నీళ్లు, మెలిచిన పచ్చిక గడ్డిపైన ఉండే కీటకాలతో కూడిన మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు వివిధ రకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన త్వరగా పడతాయి. చివరకు పశువులు ప్రాణాలు కోల్పోతాయి.

READ ALSO : Nandamuri Suhasini Son Marriage: మనవడి వివాహ వేడుకలో సందడి చేసిన చంద్రబాబు, బాలయ్య .. ఫొటోలు వైరల్

1)గొంతు వాపు వ్యాధి :

వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చే జబ్బు గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అనికూడా అంటారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన వస్తుంది. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడి కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టతరంగా మారుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీల్చుకోవటానికి ఇబ్బందిపడుతుంది. గుర్రు గుర్రుమని గురక వంటి శబ్దం వస్తుంది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ జబ్బువచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి.

READ ALSO : Venigandla Ramu : గుడివాడ టికెట్ చంద్రబాబు ఎవరికిచ్చినా నాకు బాధ లేదు, కొడాలి నానిని ఓడించడమే నా ధ్యేయం- వెనిగండ్ల రాము

చికిత్స : వర్షాకాలం ముందుగా జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో క్లీన్ చేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేసుకోవాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్‌టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి. మిగిలిన పశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించి తగిని సూచనలు , సలహాలు తీసుకోవాలి.

READ ALSO : Intercropping In Oil Palm : పామాయిల్ లో అంతర పంటగా బొప్పాయి, పుచ్చసాగు

2)గాలికుంటు వ్యాధి/ నంజు జ్వరము:

ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వచ్చే వ్యాధి. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో విరివిగా పశువులకు గాలికుంటువ్యాధి సోకుతుంది. గిట్టలు ఉన్న ప్రతి జీవి ఈ అంటువ్యాధి వస్తుంది బారినపడతాయి. వ్యాధి సోకిన సమయంలో పశువుకు 104 నుండి 105 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. నోటిలో, గిట్ల మధ్య పుండ్లు పడి పశువులు నడవలేని పరిస్ధితిని ఎదుర్కొంటాయి. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత మేయలేక పోతాయి. నీరసంగా ఉంటాయి. వర్షాకాలంలో నేలలు తడిగా ఉండటంవల్ల గాలికుంటు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధివల్ల చూడిగేదెలు ఈసుకుపోయే ప్రమాదం ఉంటుంది. పాడిగేదెలకు పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో అయితే రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసించిపోతాయి, రొప్పుతాయి.

READ ALSO : Immunity Boosting : రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్!

చికిత్స;

వ్యాధి సోకిన పశువును మంద నుంచి ముందుగా వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె అప్లై చేయాలి. యాంటిబయోటిక్స్‌, పెయిన్‌కిల్లర్స్‌ వాడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. బిస్ప్రేపెన్‌ 2.5గా, ఎన్‌రోప్లాక్సిన్‌ 50 ఎంఎల్‌, సెఫ్‌ట్రిక్సిన్‌ 3 గ్రా, మెలోనెక్స్‌ 30 యం.యల్‌, నిమోవెట్‌ 50 యంయల్‌ వాడితేపశువులు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుంటాయి.

READ ALSO : Plant Protection In Papaya : బొప్పాయి నారుమడుల్లో చీడపీడల గండం.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

3)జబ్బవాపు:

ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు వస్తుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువగా వస్తుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు,ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది.

READ ALSO : Terrac Garden : మిద్దెపై కూరగాయలు, పండ్లు పెంపకం

చికిత్స;

వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్ వంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని ఇతర పశువుల నుండి వేరుచేయాలి, చనిపోయిన పశువును వెంటనే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే జబ్బవాపు వ్యాధి టీకాలను పశువులకు వేయించాలి.