Zinc : వరిలో జింక్ లోపం చేపట్టాల్సిన చర్యలు

వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. లేదా పైరు పై జింక్‌ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి.

Zinc : వరిలో జింక్ లోపం చేపట్టాల్సిన చర్యలు

Vari

Zinc : వరి పంటలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. వరి నారుమడి లేదా పిలకలు వేసే దశలో సాధారణంగా ఇనుపదాతు, జింకు లోపం కనిపిస్తోంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరు పక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. జింక్ ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది.ఈ లోప తీవ్రత ఎక్కువైనప్పుడు ముదురు ఆకు చివర్లలో ,మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుకరంగు మచ్చలు కనపడతాయి. ఆకులు చిన్నవిగా ,పెళుసుగా మారితాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు.నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు.

క్షౌర నేలల్లో, సున్నం అధికంగా ఉన్న నేలల్లో, పాటిమన్ను పొలాల్లో, బైకార్బనేట్‌ ఎక్కువగా ఉన్న పొలాల్లో నీటితో సేద్యం చేసినప్పుడు ఇనుము లోపం ఎక్కువగా కనబడుతోంది. భాస్పరం ఎరువులు అధికంగా వాడే నేలల్లో ఇనుముదాతు లోపాలు రావచ్చు. మెట్ట వరి నారుమళ్లలో, వరిపై లోపం కనబడుతోంది. నల్ల రేగడ్లు, క్షారభూములు, సున్నం అధికంకాగల నేలలు, మురుగునీరు పోకుండా నిల్వ ఉండే భూములు, వరుసగా వరి వేసే నేలల్లో జింకు లోపాలు కనబడతాయి.

వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. లేదా పైరు పై జింక్‌ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 5 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి. జింక్‌ లోపం వల్ల దాదాపు 10 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈసమయంలో తప్పకుండా జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారి చేయాలి. జింక్ సల్ఫేట్ ధ్రావణం లో తెగుళ్ళ మందులను కలుపరాదు. చౌడు నేలల్లో జింక్ సల్ఫేట్ పిచికారి తప్పకుండా చేయాలి.

పంట ఏ రకంగా పెరుగుతుందో రైతు రోజూ పరిశీలించుకోవాలి. ఇటుక రంగుతో పైరు ఎర్రబారిన వెంటనే జింక్‌ వేసుకోవాలి . జింక్‌ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడువుతుంది. జింక్ లోప నివారణకు ఒకే వరి పంటకు భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి రబీ సీజన్ లో,ఆఖరి దుమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.లేదా 10 కిలోల జింక్ సల్ఫేట్ ను 200-500కిలోల బాగా మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ తో కలిపి 20 నుంచి 30 రోజుల వరకు గోనే సంచిలో ఉంచి మాగ బెట్టి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి.