Papaya Cultivation Techniques : బొప్పాయిలో చీడపీడల బెడద – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను, భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తటం సహజంగా కన్పిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది.

Papaya Cultivation Techniques : బొప్పాయిలో చీడపీడల బెడద – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Papaya Cultivation Techniques

Papaya Cultivation Techniques : తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే ధైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయిసాగు ఉన్నతస్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలకు చీడపీడల సమస్య అధికంగానే ఉంటుంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట వేసే ముందే నుండే పలు జాగ్రత్తలు పాటించినట్లైతే అధిక దిగుబడులను పొందవచ్చు.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయి సాగులో రైతులు అనుసరించాల్సిన సస్యరక్షణ చర్యలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. హెక్టారుకు 50 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు రైతులు. అయితే ఈ పంటకు చీడపీడల బెడద ఎక్కువే.

ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను, భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తటం సహజంగా కన్పిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్ లో మంచి ధర రాదు. మరి ఈ సూక్ష్మదాతు లోపాల నివారణకు రైతులు ప్రతేక చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

READ ALSO : Chilli Cuts Cultivation : మిరప కోతల సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయికి రకరకాల తెగుళ్లు ఆశిస్తాయి. ముఖ్యంగా భూమి ద్వారా కొన్ని తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. శిలీంద్రానికి సంబందించిన కాండం కుళ్లు తెగులు మొదటి దశలో ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు మొదలు కుళ్లి పోయి, మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇందు కోసం మొక్కలు నాటే ముందే కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టితే వీటిని నివారించవచ్చు .

రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఆశించి బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులును వ్యాప్తి చేస్తుంటాయి. సకాలంలో గుర్తించి వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త , డా. పి. సుధా జాకబ్ తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని క్రింది వీడియో పై క్లిక్ చేయటం ద్వారా చూడవచ్చు.