Animal Husbandry : వేసవి పశుపోషణలో జాగ్రత్తలు

వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు.

Animal Husbandry : వేసవి పశుపోషణలో జాగ్రత్తలు

Animal Husbandry

Animal Husbandry : ఎండల తీవ్రత కూడా రోజురోజుకు పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పాడి పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆవుల ,గేదెలు ఎక్కువగా వడ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అవులు కంటే గేదెలు నల్లగా ఉండడం వల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశుపోషణ విషయంలో ఎండాకాలంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, గాలి ప్రసరణ ఎక్కువగా లేకపోవడం, షెడ్లలో ఎక్కువ పశువులు ఉండడం వల్ల ఉక్కపోత, నీటి సౌకర్యం తక్కువగా ఉండడం వల్ల పశువులు వడ దెబ్బకు గురవుతాయి.

వడ దెబ్బ తగలకుండా వీలైనంత వరకు రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పశువులకు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీలు మాత్రమే. అంతకంటే ఎక్కువగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటాయి. నోట్లో లాలా జలం కూడా తగ్గిపోతుంది. నెమరు వేయడానికి వీలు పడదు. దాహం ఎక్కువగా ఉండి ఎక్కువ నీళ్లు తాగుతాయి. ఫలితంగా మేత సరిగ్గా తినవు. శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయులు తగ్గిపోయి నీరసించిపోతుంది. పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.

వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి.  చల్లని నీటిలో తడిపిన బట్ట, గోనె సంచిని కప్పాలి. సెలైన్ ఎక్కించడం లేదా సోడియం క్లోరైడ్ అందించడం చేయాలి. వేసవిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాలి కుంటు వ్యాధి, గొంతు వాపు, జబ్బ వాపు వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. మురుగు నీళ్లు తాగితే జీర్ణ కోశ వ్యాధులు వస్తాయి కాబట్టి శుభ్రమైన నీటిని అందించాలి. ఎప్పటికప్పుడు వాటిని పరిశుభ్రంగా, చల్లగా ఉంచుకోవాలి.

ఎండ తీవ్రత నుంచి తగ్గించేందుకు మంచి గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. షెడ్ ల చుట్టూ చెట్లు ఉండాలే చూసుకోవాలి. పశువులను రోజుకి రెండు మూడు సార్లు కడగాలి. తాగేందుకు ఎక్కువ నీటిని అందుబాటులో ఉంచాలి. అవి కూడా చల్లగా ఉండేలా చూసుకోవాలి. సులువుగా అరిగించుకునే జావ, గంజి వంటివి ఇవ్వాలి. పచ్చి గడ్డి ఎక్కువగా ఇవ్వాలి. లేదంటే మాగుడు గడ్డి ఇవ్వాలి. మేత కూడా ఉదయం సాయంత్రం ఇవ్వాలి. పచ్చి గడ్డిని పగలు, ఎండు గడ్డిని రాత్రి వేళల్లో అందించాలి. ఎండ వేళల్లో వాటికి విశ్రాంతి ఇవ్వాలి.