Chamanti Cultivation : రైతులకు అదాయాన్ని తెచ్చిపెడుతున్న చామంతి సాగులో యాజమాన్య పద్ధతులు !

ఆఖరి దుక్కిలో 25 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, 30 కి॥ పొటాష్‌ నిచ్చే ఎరువులు వేయాలి. మరల 50% పూ మొగ్గలు వచ్చిన తరువాత 15 కి॥ నత్రజనిపై పాటుగా వేయాలి. చామంతిలో కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ 1 కిలో / హె. నివారణ మందును నాటిన 25 రోజుల మరియు 60 రోజుల తరువాత ఉపయోగించడం వలన కలుపును నివారించవచ్చు.

Chamanti Cultivation : రైతులకు అదాయాన్ని తెచ్చిపెడుతున్న చామంతి సాగులో యాజమాన్య పద్ధతులు !

Chamanti Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పరంగా సాగులో ఉన్న పూల పంట చామంతి. చామంతి శీతాకాలం పంట కనుక పూలు ఎక్కువగా అంటే నవంబర్‌ నెల నుంచి మార్చి వరకు లభ్యమవుతాయి. సేంద్రీయ పదార్ధం అధికంగా ఉన్న ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలలు చామంతి సాగుకు అనుకూలం. ఇది శీతకాలం పంట. తేమ ఎక్కువగా ఉండి, పూలు పూసేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు, ఉండే ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలము. శాఖీయంగా పెరుగుటకు ఎక్కువ పగటి సమయం అనుకూలం.

చామంతిని శాఖీయ కొమ్మల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ఏపుగా పెరుగుతున్న కొమ్మలను 10 సెం.మీ. ఉండేలా కత్తిరించి మళ్ళలో నాటుకోవాలి. కొమ్మల నుండి వేర్లు రావడానికి 15-20 రోజులు పడుతుంది. పాలంలో పూలకోత పూర్తయిన తరువాత తల్లి మొక్కలను క్రింది వరకు కత్తిరించి, వాటిని ఒక మడిలో నాటుకోవాలి, మంచి ఎరువులు ఇచ్చిన ఒక్కో మొక్క నుంచి నెల రోజులలో 200 కొమ్మలను పొందవచ్చు. కొమ్మలను 50 పి.పి.యం. ఇండోలు బ్యూటరిక్‌ ఆమ్లం (ఐ.బి.ఏ.) ద్రావణంలో ముంచి నాటితే వేర్లు త్వరగా వస్తాయి. కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేసిన మొక్కలు త్వరగా పెరిగి పూల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది.

చామంతిలో చాలా రకాలున్నాయి. వాణిజ్య సరళిలో పెంచేందుకు పసుపు, తెలుపు, ఎరుపు రంగు రకాలు ముఖ్యమైనవి. ఇదే కాకుండా ఐటన్‌ రకాలు చిట్టి చామంతిగా కూడా రైతులు పెంచవచ్చు. చామంతి మొక్కలు నాటిన తరువాత అంటే ఆగష్టు – సెప్టెంబర్‌ నెలల్లో 30-40 రోజులు కనీసం 30 సెం.మీ. ఎత్తు పెరిగే వరకు ఉష్ణోగ్రతలు 30-35 సెం.గ్రే. వద్ద ఉండాలి. అందువల్ల మొక్కలు పూత దశకు వచ్చే 50 రోజుల ముందుగా మాత్రమే మొక్కలు నాటుకోవాలి. మొక్కలను పొలంలో ఒక్కసారిగా కాకుండా 15-20 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా నాటితే పూలను ఎక్కువ కాలం పొందే వీలుంటుంది. మొక్కల సాంద్రత విషయానికి వస్తే మొక్కలను 30-30 సెం.మీ. లేదా 30-45 సెం.మీ. ఎడంగా నాటవచ్చు.

ఎరువుల యాజమాన్యం: ఆఖరి దుక్కిలో 25 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, 30 కి॥ పొటాష్‌ నిచ్చే ఎరువులు వేయాలి. మరల 50% పూ మొగ్గలు వచ్చిన తరువాత 15 కి॥ నత్రజనిపై పాటుగా వేయాలి. చామంతిలో కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ 1 కిలో / హె. నివారణ మందును నాటిన 25 రోజుల మరియు 60 రోజుల తరువాత ఉపయోగించడం వలన కలుపును నివారించవచ్చు.

కత్తిరింపులు: ఒక మొక్క నుంచి ఎక్కువ పూలు పొందడానికి మొక్కలు 30 సెం.మీ. ఎత్తు పెరిగిన వెంటనే తలలు కత్తిరించిన వారం, పది రోజులకు పక్క కొమ్మలు వస్తాయి. పొడవైన పూల కాడతో ప్లూలు ‘పొందాలనుకున్న మొక్కకు ఈ కత్తిరింపు సరిపోతుంది. విడిపూలు మాత్రం ‘సేకరించాలనుకుంటే వ పక్క కొమ్మలను మళ్ళీ కత్తిరిస్తే ఒక్కో మొక్కకు 20-30 పూలు పొందచ్చు. శీతాకాలం ఆరంభంలోనే పూలు సేకరిస్తే మొక్కలను వెనకకి కత్తిరించి, ఎరువులు వేసుకుంటే 30 రోజులలో మ మళ్ళీ పెరిగి పూత కాస్తాయి. ఈ విధంగా వివిధ దశల్లో కత్తిరింపులు తీసుకుంటే ఎక్కువ కాలం అధిక దిగుబడి వస్తుంది. పూల లభ్యత ఎక్కువ రోజులు ఉంటే మార్కెట్‌ ధరల్లోని వ్యత్యాసం సర్దుబాటు అవుతుంది.