First Aid For Poisoned Cattle : విష ప్రభావానికి గురైన పశువులకు చేయవలసిన ప్రధమ చికిత్స ఏంటంటే?

లేత జొన్న ఆకులను మేసిన వశువులు సైనైడ్‌ ప్రభావానికి గురైనప్పుడు దీనికి విరుగుడుగా సోడియం నైటేట్‌, సోడియం థయాసల్ఫేట్‌ ద్రావణాలను వాడాలి మరియు పౌడర్‌ చార్మోల్‌ను త్రాగించాలి.

First Aid For Poisoned Cattle : విష ప్రభావానికి గురైన పశువులకు చేయవలసిన ప్రధమ చికిత్స ఏంటంటే?

First Aid For Poisoned Cattle :

First Aid For Poisoned Cattle : పశువులు విష పూరిత మొక్కలను తినటాన్ని చూసినా, లేదంటే అనుమానం కలిగిన, వెంటనే దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి పరిస్థితిని వివరిస్తే విషప్రభావ తీవ్రతను తగ్గించి పశువును కాపాడుకోవచ్చు. అన్ని రకాలైన విష కారకాలకు విరుగుడు మందులు లభించక పోయినా విష ప్రభావానికి గురైన పశువు చూపించే లక్షణాల ఆధారంగా చికిత్స చేసి పశువులను సంరక్షించుకోవచ్చు. ఈ చికిత్స చేయడం అనేది త్వరితగతిన ప్రారంభించాలి. చికిత్సలో జాష్యం జరిగితే విష ప్రభావం మరింత ఎక్కువై, పశువు మరణించే ప్రమాదం ఉంది.

పశువు తిన్న విషపదార్థం రక్తంలోకి ప్రవేశించకుండా మరియు శరీరం నుండి త్వరితగతిన బయటకు పంపించడానికి తీసుకోవలసిన చర్యలు;

ఒక లీటరు పారఫిన్‌ మైనం లేదా వంట నూనెను త్రాగించటం లేదా ప్రత్యక్షంగా పెద్ద పొట్టలోకి ఎక్కించటం. వంట బొగ్గును మెత్తగా పొడి చేసి పాలలో లేదా నీటిలో కలిపి 50 గ్రా./ ల పెద్ద పశువులకయితే 2 లీటర్లు, చిన్నవాటికి అయితే ఒక లీటరు చెప్పున తాగించాలి. 10 నుండి 12 గుడ్ల తెల్ల సొనను, పావు కేజీ పంచదారను లీటరు నీటిలో కలిపి రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు త్రాగించాలి.

ఫోటో సెన్సిటైజేషన్‌ అంటే ఒక రకమైన చర్మ వ్యాధి ప్రభావానికి లోనైన పశువులకు సులువుగా జీర్ణమయ్యే ఆహారం, పరిశ్నుభమైన నీటిని అందిస్తూ, చల్లని నీడ మరియు స్వచమైన గాలి ప్రసరించే ప్రదేశాల్లో ఉంచి ఈగలు, దోమలు వాలకుండా వేప నూనె పూయాలి. మరియు ఇంజక్షన్‌ కార్తికోస్టేరాయిడ్‌ లను ఇవ్వాలి. విష ప్రభావానికి లోనైన పశువు మూర్చవ్యాధికి గురై నేలమీద పడి తీవ్రంగా కొట్టుకుంటున్నప్పుడు వాటి పరిసర ప్రాంతాల్లో పదునైన వస్తువులు, రాళ్ళు లేకుండా చూసుకోవాలి . ఇంజక్షన్ దైజీపాం ఇవ్వాలి.

లేత జొన్న ఆకులను మేసిన వశువులు సైనైడ్‌ ప్రభావానికి గురైనప్పుడు దీనికి విరుగుడుగా సోడియం నైటేట్‌, సోడియం థయాసల్ఫేట్‌ ద్రావణాలను వాడాలి మరియు పౌడర్‌ చార్మోల్‌ను
త్రాగించాలి. ఆకలి మందగించి తీవ్రంగా నీరసించిన పశువులకు గ్లూకోస్‌ ద్రావణాన్ని మరియు కాల్షియం ఇంజక్షన్‌ను రక్తంలోకి ఎక్కించాలి మరియు విటమిన్‌ టానిక్‌లను వాడాలి.

పశువు తొందరగా కోలుకొనేందుకు వీలుగా వి కాంప్లెక్స్‌ ఇంజెక్షన్లు, కాలేయ పనితీరును పెంచే ఔషధాలు మరియు యాంటిబయోటెక్‌ ఇంజక్షన్లు వేయించాలి. ఇంజక్షన్ అట్రోపిన్ సల్ఫేట్, ఇంజక్షన్ హిమ్ పాం వంటి యాంటీ డోట్ , డీ టాక్సిఫాయింగ్ మందులను వాడుకోవాలి.