Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

ఖరీఫ్‌లో అపరాల పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. కందిలో అంతర పంటలగా పెసర, మినుగు సాగు చేపట్టవచ్చు. పెసర పంట కాలం 3 నెలలు. జూన్‌లో నాటిన కంది.. జనవరిలో కోత ప్రారంభించవచ్చు. హార్వెస్ట్‌కోత కోసే యంత్రంతో పెసరను కోత కోయవచ్చు. పంట మార్పిడి కింద అపరాలను సాగు చేయాలి.

Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

Intercropping In Kandi

Intercropping In Kandi : ఖరీఫ్‌కంది సాగు చేసే రైతులు.. అంతర పంటగా అపరాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్తవేత్తులు. అయితే కూలీల సమస్య ఉన్న నేపధ్యంలో యాంత్రికరణతో విత్తుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా విత్తనం వృదా కాకుండా, మొక్కల మధ్య దూరం సమానంగా పెరుగుతోంది. దీంతో పంట ఆరోగయంగా పెరిగి అధిక దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత.

READ ALSO : Planting Kanda : కంద నాటడానికి జూన్ నెల అనుకూలం.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మెళకువలు

ఖరీఫ్ లో వరి, పత్తి తోపాటు అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట కంది. అయితే రైతులు చాలా వరకు కందిని ఏకపంటగా సాగుచేస్తూ ఉంటారు. అయితే వాతావరణ మార్పులు , కారణంగా చీడపీడల వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అంతర పంటలను సాగుచేస్తే , ఒక పంట నష్టపోయినా మరోపంటతో ఆనష్టాన్ని పూడ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత . అంతే కాదు అపరాల పంటలను యాంత్రికరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు.

READ ALSO : Sorghum Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

ఖరీఫ్‌లో అపరాల పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. కందిలో అంతర పంటలగా పెసర, మినుగు సాగు చేపట్టవచ్చు. పెసర పంట కాలం 3 నెలలు. జూన్‌లో నాటిన కంది.. జనవరిలో కోత ప్రారంభించవచ్చు. హార్వెస్ట్‌కోత కోసే యంత్రంతో పెసరను కోత కోయవచ్చు. పంట మార్పిడి కింద అపరాలను సాగు చేయాలి. ఇలా చేయటం వల్ల ఎరువులు ఖర్చు తగ్గి.. అధిక దిగుబడులు పొందవచ్చు. మార్కెట్‌క్వింటా పెసర ధర రూ. 5800, మార్కెట్‌క్వింటా కంది ధర రూ.5600 పలుకుతుంది.