Amaravati Corporation : అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటును వ్యతిరేకించిన 19 గ్రామాలు

అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అమరావతి క్యాపిటల్‌ సిటీ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా గ్రామ సభలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.

Amaravati Corporation : అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటును వ్యతిరేకించిన 19 గ్రామాలు

Amaravati (3) 11zon

19 villages opposed Amaravati Corporation : అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తైంది. అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలు దీన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామ సభలు తీర్మానాలు చేశాయి. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని గ్రామస్తులు తెలిపారు. క్యాపిటల్ సిటీని ముక్కలు చేస్తే తాము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు నిన్నటితో ముగిశాయి. చిన్నపాటి గొడవలు మినహా గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయి. గతంలో మాదిరిగా ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అమరావతి క్యాపిటల్‌ సిటీ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా గ్రామ సభలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడంతో ఈ ప్రతిపాదనకు అడ్డంకి ఏర్పడింది.

Omicron India : దేశంలో 5,488కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఒకవేళ గ్రామసభల తీర్మానం కాదని ప్రభుత్వం ముందుకెళితే రైతులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు భూములను ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం కేవలం 19 గ్రామాలను కలుపుతూ అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీనిని రైతులు వ్యతిరేకించారు.