మహిమగల సొరకాయలట..ఒక్కటీ రూ.కోటి..ఇంట్లో ఉంటే కుబేరులైపోతారట

  • Published By: nagamani ,Published On : October 12, 2020 / 11:59 AM IST
మహిమగల సొరకాయలట..ఒక్కటీ రూ.కోటి..ఇంట్లో ఉంటే కుబేరులైపోతారట

karnool: మట్టిముద్ద తెచ్చి దీన్ని మహిమలున్నాయి..ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులైపోతారని చెబితే చాలు ముందూ వెనుకా ఆలోచించకుండా కొనేయటం..ఆపై మోసపోయామని లబోదిబోమనటం జనాలకు అలవాటైపోయింది. ఆ బలహీనతే మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది. జనాల బలహీనతల్ని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడేవారికి సమాజంలో ఏం తక్కువ లేదు. అటువంటి మోసమే జరిగింది ఏపీలో.


కేవలం 10.20 రూపాలయకు దొరికే సొరకాయ ఏకంగా లక్షల రూపాయలు..కోటి రూపాయలు అని చెప్పి అమ్మేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. మొత్తం 21మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసగాళ్లంతా ఓ ఆశ్రమంలో పనిచేస్తుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సొరకాయలు చాలా అరుదైనవనీ..చాలా అద్భుతమన మహిమలు కలవని చెప్పి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.



‘నాగస్వరం’ ఆకారంలో ఉండే సొరకాయలు అన్ని చోట్లా పండవనీ కేవలం శ్రీశైలం మల్లిఖార్జును కొలువన నల్లమల అడవుల్లో కొన్ని ప్రాంత్రాల్లో మాత్రమే పండుతాయని అవి చాలా అద్భుతమన మహిమలు కలవని చెప్పి మోసగాళ్లు ఈ మోసాలకు తెరలేపారు.


రూపాయలు పలికే సొరకాయకు లేని మహిమలను అంటగట్టి లక్షలు, కోట్లకు అమ్ముకుంటున్నారు. అలా బృందాలుగా విడిపోయి ప్రజలు మోసం చేస్తూ డబ్బు దండుకుంటున్న 21 మంది కేటుగాళ్లను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మామూలుగా దొరికే సొరకాయలను తాము ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్మినట్టు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారని కూడా పోలీసులు తెలిపారు.


నాగస్వరంలా ఉండే సొరకాయలను పాములను ఆడించేవారు ఎండబెట్టి నాగస్వరంగా వాడుతుంటారు. అవి చేదుగా ఉంటాయి.కాబట్టి వాటిని కూరకు ఉపయోగించరు. వాటిని ఎండబెట్టి నాదస్వరాలకు వాడుతుంటారు పాములు పట్టిఆడించేవాళ్లు. ఇటువంటి నాగస్వరం ఆకారంలో ఉండే సొరకాయలు ఎక్కడపడితే అక్కడ పండవనీ..కేవలం శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన నల్లమల అడవుల్లో మాత్రమే పండుతాయని..ఇటువంటి సొరకాయలకు అద్భుతమైన మహిమలు ఉంటాయని వాటిని ఇంట్లో పెట్టుకుంటే ఆ సర్వేశ్వరుడు కరుణి్స్తాడని..కుబేరులైపోతారని మోసగాళ్లు ప్రజల్ని నమ్మించారు. శ్రీశైలం వచ్చే భక్తులు వారు చెప్పే మాయ మాటలు నమ్మి సొరకాయలకు వేలు, లక్షలు, కొంతమందైతే కోటి రూపాయలకు కూడా చెల్లించి కొన్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది.


21 మంది సొరకాయల మోసగాళ్లంతా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందినవారని..శ్రీశైలంలోని అన్నపూర్ణ ఆశ్రమానికి చెందినవారని ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర తెలిపారు. వీరిలో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితులపై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.