Chandrababu : చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన టీడీపీ నేతల బృందం

టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి టీడీపీ బృందం అందజేసింది.

Chandrababu : చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన టీడీపీ నేతల బృందం

Chandrababu

Chandrababu met Ram Nath Kovind : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. చంద్రబాబు నాయుడుతోపాటు ప్రతినిధి బృందంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేశినేని నాని, కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి టీడీపీ బృందం అందజేసింది. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ,డ్రగ్స్ మైనింగ్, సాండ్, మాఫియా విస్తరించిందని తెలిపింది. న్యాయ, మీడియా సహా అన్ని వ్యవస్థలపైన దాడులు జరుగుతున్నాయని రాష్ట్రపతికి దృష్టికి తీసుకెళ్లారు.

టీడీపీ బృందం నాలుగు ప్రధాన డిమాండ్లు రాష్ట్రపతిని కోరింది. ఏపీలో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలి. అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలి. అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీని రీకాల్ చేయాలని రాష్ట్రపతిని కోరింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోన్న టీడీపీకి… వాళ్లిద్దరూ అపాయింట్‌మెంట్ ఇస్తారా.. లేదా.. అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Pattabhiram : టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసు..మరో ఏడుగురు నిందితులకు నోటీసులు

మరోవైపు వైసీపీ నాయకులు కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు. రెండు పార్టీల నాయకులు.. ఢిల్లీ టూర్లకు సిద్ధమవడంతో.. ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఢిల్లీ వేదికగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది.. మరింత ఆసక్తిగా మారింది.