ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి…10 టీవీ కథనాలకు స్పందించిన అధికారులు

  • Published By: bheemraj ,Published On : July 25, 2020 / 06:14 PM IST
ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి…10 టీవీ కథనాలకు స్పందించిన అధికారులు

అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా.. తల్లి ప్రేమపై కూడా తన కర్కశత్వాన్ని చూపిస్తోంది. కన్న పేగు బాంధవ్యాన్ని సైతం కరోనా తెంచేస్తోంది. ఆకలి బాధ తీర్చలేక ఓ తల్లి.. బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్ముకోబోయిన తల్లికి సంబంధించి 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. పెనుగొండ ఆర్డీవో హరిప్రసాద్ వెంటనే వారి కుటుంబ పరిస్థితి తెలుకుని వెంటనే వారికి రూ.20 వేలు ఆర్థిక సహాయం చేయడంతోపాటు మూడు నెలలకు సరిపడా సరుకులు సమకూర్చారు. అంతేకాకుండా తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణం కోసం ఆరోగ్య కార్యకర్తను ఏర్పాటు చేశారు.

కుటుంబం మొత్తానికి పౌష్టికాహారంతోపాటు ఆరు నెలలకు సరిపడా నిత్యవసరాలు సమకూర్చేందుకు కురుబా కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ముందుకొచ్చారు. దీంతో తల్లిఒడి నుంచి బిడ్డ పోకుండా ఉండేందుకు 10 టీవీ చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. కరోనా కారణంగా పనులు దొరక్కపోవడంతో అనంతపురం జిల్లా రొద్దంకు చెందిన ఓ జంట తీవ్ర ఇబ్బందులు పడింది. కన్నబిడ్డ ఆకలి తీర్చలేక బిక్షాటన చేసుకునే వారికి అమ్మేందుకు ప్రయత్నించారు.

ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్ముకోబోయిన దయనీయ ఘటన వెలుగు చూసింది. రొద్దం మండలానికి చెందిన ఓ జంట కన్న బిడ్డ ఆకలి తీర్చలేక బిడ్డను బిక్షాటన చేసుకునే వారికి అమ్ముకునే ప్రయత్నం చేశారు. అసలే వికలాంగులు అందులోనూ కరోనా వల్ల పనులు లేకపోవడంతో పోషణ భారమై ఈ దారుణానికి ఒడిగట్టారు.