Cheating in Tirumala: ప్రత్యేక దర్శన టికెట్లు అంటూ సర్వదర్శన టోకెన్లు అంటగట్టిన దళారీలు: తిరుమలలో కొత్త తరహా మోసం

ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టిన ఘటన ఒకటి తాజాగా తిరుమలలో వెలుగు చూసింది.

Cheating in Tirumala: ప్రత్యేక దర్శన టికెట్లు అంటూ సర్వదర్శన టోకెన్లు అంటగట్టిన దళారీలు: తిరుమలలో కొత్త తరహా మోసం

Ttd

Cheating in Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో కొందరు దళారీలు భక్తులు మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగు చూశాయి. భక్తుల విశ్వాసాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు..ఈదారుణాలకు పాల్పడుతున్నారు. ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టిన ఘటన ఒకటి తాజాగా తిరుమలలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..కరోనా అనంతర ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం తిరుమలలో ఉచిత సర్వదర్శన సౌకర్యం కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా సాధారణ భక్తులు ఉచిత సర్వదర్శనానికి పోటెత్తుతున్నారు. ఈక్రమంలో మార్చి 30న గుంతకల్ కు చెందిన కొందరు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. అయితే సర్వదర్శనంలో దర్శనం ఆలస్యం అవుతుందని భావించిన భక్తులు..శీఘ్ర దర్శన టోకెన్ల కోసం స్థానిక దళారీని ఆశ్రయించారు.

Also read:MIM Corporator: పోలీసులపై రెచ్చిపోయిన మరో మజ్లిస్ కార్పొరేటర్.. మీకు ఇక్కడేం పనిఅంటూ ఆగ్రహం

ఈక్రమంలో దళారి కిరణ్ కుమార్ వారికి ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇప్పించి..అవి రూ.300 విలువ చేసే శీఘ్ర దర్శన టోకెన్లుగా నమ్మించాడు. అంతే కాదు ఈ టోకెన్లతో ప్రత్యేక ప్రవేశద్వారం దర్శనం కల్పిస్తున్నామంటూ అదనంగా మరో రూ.200 భక్తుల నుంచి నొక్కేసాడు కిరణ్ కుమార్. ఇక శీఘ్ర దర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూ కాంప్లెక్స్ లో రూ.300 ప్రవేశ ద్వారా వెళ్తుండగా..సిబ్బంది అవి సర్వదర్శన టోకెన్లు అంటూ వారించారు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు అక్కడే టీటీడీ విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also read:Liquor in Telangana: తెలంగాణలో మద్యం అధికంగా సేవిస్తున్న వారిలో ఆ జిల్లానే టాప్

ఘటనపై టీటీడీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి టూ టౌన్ పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దళారీలు కౌంటర్ సిబ్బందితో కుమ్మక్కై టోకెన్ల కోసం వచ్చే భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజా ఘటనపై టీటీడీలో పనిచేసే ఇద్దరు కౌంటర్ సిబ్బంది పై విజిలెన్స్ అధికారులు పోలిసులుకు పిర్యాదు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా టీటీడీ సమాచార కేంద్రానికి చేరుకోవాలని అక్కడ పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతే టోకెన్లు పొందాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

Also read:Gold-Silver Prices : స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి..!