strange custom : మేడలేని ఊరు…అంతస్తుల భవంతి నిర్మిస్తే అశుభమంట… ఆ గ్రామంలో వింత ఆచారం

పెద్దహోతూరులో మాత్రం చూద్దామంటే ఒక్క మేడ కన్పించదు. అలాంటి నిర్మాణాలు కడితే అశుభమని గ్రామస్థుల్లో ఒకరకమైన భయం ఉంది. తరతరాలుగా ఇద్దే తీరు కొనసాగుతోంది.

strange custom : మేడలేని ఊరు…అంతస్తుల భవంతి నిర్మిస్తే అశుభమంట… ఆ గ్రామంలో వింత ఆచారం

Strange Custom

A strange custom in the village : ప్రస్తుతం పల్లెల్లో గుడిసె ఇళ్ళు, పెంకుటిల్లు, రేకుల ఇళ్ళు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఒక వేళ చూసినా కనీసం ఒక్కటైనా మేడ ఇల్లు ఉంటుంది. అదే పట్టణాలు, నగరాల్లో అయితే ఒకటి కాదు.. రెండు కాదు మూడంతస్తుల భవనాలు అనేకంగా ఉంటాయి. ఏ చిన్న స్థలం ఉన్నా చాలు ఇంటి పైన ఇల్లు కట్టేస్తుంటారు. పెద్దహోతూరులో మాత్రం చూద్దామంటే ఒక్క మేడ కన్పించదు. అలాంటి నిర్మాణాలు కడితే అశుభమని గ్రామస్థుల్లో ఒకరకమైన భయం ఉంది. తరతరాలుగా ఇద్దే తీరు కొనసాగుతోంది.

ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో దాదాపు 1,500 నివాస గృహాలు.. 6 వేలకు పైగా జనాభా ఉంది. గ్రామస్థులు ఉచ్చీరప్పతాతను కులదైవంగా ఆరాధిస్తారు. దాదాపు 500 ఏళ్ల కిందట ఉచ్చీరప్పతాత ఎక్కడి నుంచో వచ్చి గ్రామంలో స్థిరపడిపోయారు. స్థానికులతో మమేకమై అందరికీ మంచి చేస్తూ.. ఉండిపోయారు. కొన్నేళ్ల తరువాత గ్రామంలోనే సజీవ సమాధి అయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి.. ఆరాధిస్తూ.. వచ్చారు. అప్పట్లోనే ఆలయ ఆవరణలో రెండంతస్తుల మేడ నిర్మించారు. తాతకు సంబంధించి మేడ ఉండటంతో గ్రామస్థులు ఎవరూ ఇంకో మేడను గ్రామంలో కట్టరాదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ దాన్ని ఆచరిస్తుండటం విశేషం.

నేటి కంప్యూటర్‌ యుగంలో మారుమూల గ్రామాల్లోనూ మేడలు వెలుస్తున్నాయి. పెద్ద భవంతులు కట్టుకునే స్థోమత ఉన్నా.. గ్రామ పద్ధతులను పాటిస్తూ.. గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు. గతంలో ఒక వ్యక్తి మేడ కట్టేందుకు ప్రయత్నించగా, ఊహించని రీతిలో మృతి చెందారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అప్పటి నుంచి ఏ ఒక్కరూ కూడా అలాంటి సాహసం చేయలేదంటున్నారు. ఉచ్చీరప్పతాత ఆలయ ఆవరణలో ఉన్న మేడపై మరో కట్టడం నిర్మిస్తే అప్పుడు రెండస్తుల మేడ నిర్మించుకోవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. దీన్ని ఎవరూ పట్టించుకోకుండా గ్రామ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం విశేషం.