Janasena : మరో యాత్రకు భీమ్లా నాయక్ రెడీ

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శంచుకున్నాక యాత్ర మొదలు పెడతానన్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న పార్టీలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్‌.

Janasena : మరో యాత్రకు భీమ్లా నాయక్ రెడీ

Janasena

Actor Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. నారసింహ సందర్శన పేరుతో యాత్ర చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కాంక్షిస్తూ నారసింహ సందర్శన చేపట్టనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శంచుకున్నాక యాత్ర మొదలు పెడతానన్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న పార్టీలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్‌. జనసేన సోషల్ మీడియా వింగ్ కు ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

Read More : Tollywood : చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ కూడా.. జగన్‌ని కలవడానికి వెళ్తున్న స్టార్స్

దత్తపుత్రుడు అని పదే.. పదే విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినన్నారు. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని వారిలో ఆశలు వైసీపీ కల్పించిందన్నారు పవన్. పీఆర్‌సీ అమలు చేయకపోవడంతో ఆగ్రహంతో ఉద్యోగులు నిరసన తెలిపితే .. జనసేనపై విమర్శలు చేయడం సరికాదన్నారు పవన్ కల్యాణ్‌. వీరి సమస్య విపక్షాలు సృష్టించింది. కాదని, అధికారంలోకి వచ్చాక వైసీపీ పలు హామీలు గుప్పించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Read More : Pooja Hegde: టాలీవుడ్ టూ బాలీవుడ్.. కెరీర్ బెస్ట్ టైమ్ ఎంజాయ్ చేస్తోన్న బుట్టబొమ్మ!

సీపీఎస్ ను రద్దు చేస్తాం, వేతనాలు పెంచుతామని వారికి హామీలు ఇచ్చారన్నారు. అందువల్లే ఉద్యోగులు వారికి రావాల్సినవి అడుగుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు ఏం చేసినా డూడూ బసవన్నలా తల ఊపేసి వెళ్లి పోవాలా అని ప్రశ్నించారు. అలా .. కాదంటే, న్యాయమూర్తుల దగ్గరి నుంచి నల్ల బ్యాడ్జిలు పెట్టుకున్న టీచర్ల వరకు అందరూ వైసీపీకి శత్రువులుగానే కనిపిస్తారన్నారు. న్యాయంగా వారి హక్కుల గురించి మాట్లాడితే పట్టించుకోరని విమర్శించారు. ప్రభుత్వం పద్ధతిగా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. మంత్రులందరూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు పవన్ కల్యాణ్.