Actor Shivaji : దూరం చేయాలనుకుంటే.. రాహుల్‌ను చంపేయండి- నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

రాహుల్ ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే.. రాహుల్ ను చంపేయండి అని శివాజీ అన్నారు.(Actor Shivaji)

Actor Shivaji : దూరం చేయాలనుకుంటే.. రాహుల్‌ను చంపేయండి- నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

Actor Shivaji : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సినీ నటుడు శివాజీ తీవ్రంగా స్పందించారు. రాహుల్ అనర్హతను తీవ్రంగా ఖండించిన శివాజీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాహుల్ ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే.. రాహుల్ ను చంపేయండి అని శివాజీ అన్నారు.

ప్రధాని మోడీ విధానాలను ఎవరూ హర్షించరు అని శివాజీ అన్నారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని నిర్మించిందన్న శివాజీ.. రాహుల్ కోసం అందరూ ముందుకు
రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. బైబై మోడీ అని ఆయన నినదించారు.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు సినీ నటుడు శివాజీ. డబ్బులు పెట్టకున్నా ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.(Actor Shivaji)

Also Read..KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా

రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నాయి. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే రాహుల్‌ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు నేతలు. ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటిరోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాలపై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాల్సిన అవసరముందన్నారు.

Also Read..CM KCR: దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్.. ఖండించిన కేటీఆర్, కవిత

రాహుల్ గాంధీపై అనర్హత వేటు..
ప్రధాని నరేంద్రమోదీ ఇంటి పేరు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ వెంటనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్‭సభకు అనర్హుడయ్యారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇప్పటికిప్పుడే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‭సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.(Actor Shivaji)

2019 కర్నాటక ఎన్నికల సమయంలో మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన కేసును నాలుగేళ్లుగా విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ కు జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. అప్పీల్ కు వెళ్లడానికి 30 రోజుల గడువు విధించింది. అయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కరోజు వ్యవధిలోనే లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆయన లోక్ సభ సభ్యత్వం చెల్లుబాటు కాదని ప్రకటించడం సంచలనం రేపింది.