CM KCR: దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్.. ఖండించిన కేటీఆర్, కవిత

రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.

CM KCR: దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సీఎం కేసీఆర్.. ఖండించిన కేటీఆర్, కవిత

Telangana CM KCR

CM KCR: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఈ చర్య ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ సస్పెన్షన్ నిర్ణయాన్ని ఖండించారు.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం.. బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాహుల్ అనర్హత వేటును ఖండించారు. ‘‘రాహుల్ గాంధీ అనర్హత.. రాజ్యాంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే. అనర్హత వేటు అంశంలో చూపిన తొందరపాటు చర్య అప్రజాస్వామికం. దీన్ని నేను ఖండిస్తున్నా’’ అంటూ కేటీఆర్ స్పందించారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా దీనిపై స్పందించారు. ‘‘మోదీ హఠావో.. దేశ్ బచావో.. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిసినా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవడానికి, అవినీతిపరులైన స్నేహితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం, ప్రతిపక్షాలను అణచివేయడం అనే మోదీ మిషన్‌లో ఇదో పెద్ద భాగం’’ అని కవిత అభిప్రాయపడ్డారు.