Bejawada : కరోనాకు తోడు..బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్, నమ్మలేని కల్తీ నిజాలు

కల్తీ.. కల్తీ.. బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారులు చేస్తున్న దాడుల్లో.. ఒక్కొక్కటిగా కల్తీ కేటుగాళ్ల అక్రమాలు బయటపడుతున్నాయి.

Bejawada : కరోనాకు తోడు..బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్, నమ్మలేని కల్తీ నిజాలు

Bejawada

adulterated food  : కల్తీ.. కల్తీ.. బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారులు చేస్తున్న దాడుల్లో.. ఒక్కొక్కటిగా కల్తీ కేటుగాళ్ల అక్రమాలు బయటపడుతున్నాయి. ఏకకాలంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్స్, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు చేసిన దాడుల్లో.. నమ్మలేని కల్తీ నిజాలు బయటపడుతున్నాయి. అదీ.. ఇదీ అనే తేడా లేకుండా జరుగుతున్న కల్తీని చూసి అధికారులే షాకవుతున్నారంటే.. విజయవాడలో కల్తీ మాఫియా ఏ రేంజ్‌లో రెచ్చిపోతోందో అర్థం చేసుకోవచ్చు. కావేవీ కల్తీకనర్హం అంటున్నారు బెజవాడ కల్తీ కేటుగాళ్లు.

ప్రజల ఆరోగ్యమంటే లెక్కలేదు.. అధికారులంటే అసలే భయం లేకుండా ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి, నిల్వ ఉంచిన మాంసాలు, పండ్లకు రసాయన పూతలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో కల్తీలు. నిగనిగలాడేలా ప్యాకెట్లు, దాని మీద ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టి మాయ చేస్తున్నారు. అసలేదో.. నకిలీ ఏదో గుర్తించడానికి కూడా వీలు లేకుండా ప్యాకింగ్‌తో బోల్తా కొట్టిస్తున్నారు. ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. జనాల్ని మాయ చేస్తున్నారు.

స్వచ్ఛమైన నెయ్యిని సైతం కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పామాయిల్, వనస్పతి, ఇతర రసాయనాలతోపాటు క్యాన్సర్‌కు కారకమైన వైట్‌ ఆయిల్‌ను నెయ్యిలో వాడుతున్నారు. జంతువుల నుంచి వేరు చేసే కొవ్వునూ, వాటి ఎముకల ద్వారా తయారు చేసే నూనెలను నెయ్యిలో కలుపుతున్నారు. గత ఏడాది చివరిలో ఆహారభద్రతా అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సంయుక్త దాడుల్లో విజయవాడ నగరంలోని పాతపాడు, దేవీనగర్, ఇందిరా నాయక్‌నగర్, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో భారీగా కల్తీ నెయ్యి పట్టుపడింది. నెయ్యి తయారీలో కెమికల్స్, పాడైపోయిన వెన్నను వాడినట్లు తనిఖీల్లో తేలింది.

కుళ్లిపోయిన.. నిల్వ ఉంచిన మాంసం.. వినడానికి మనకి కాస్త కొత్తగా ఉన్నా.. విజయవాడలో ఈ దందా కామన్‌. బెజవాడలో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఉన్నాయి.. ఇప్పుడు జరుగుతున్నాయి. నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారులు అలవాటుగా మార్చుకోవడం.. తనిఖీలు నిర్వహించడం అధికారులకు కామన్‌ అయిపోయింది. తాజాగా.. కుళ్లిన మాంసాన్ని వినియోగదారులకు అంటగడుతున్న కొన్ని రెస్టారెంట్లను గుర్తించారు అధికారులు. నిన్నమొన్నటి వరకూ కేవలం మాంసం విక్రయ కేంద్రాల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ఇప్పుడు రెస్టారెంట్లలో కూడా ఈ తతంగం మొదలైంది. విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో.. ఆంజనేయ, బర్కత్‌, మిలాప్‌, ప్యారడైజ్‌ హోటళ్లపై దాడులు నిర్వహించారు. దాదాపు 25 కేజీల కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. నిల్వ ఉంచిన మాసంలో రంగులు కలిపి కస్టమర్లకు అందిస్తున్నారని తేల్చారు. ఈ వ్యవహారంపై గతంలో అనేక సార్లు హెచ్చరించినా.. కొందరు హోటల్‌ యజమానులు తీరు మార్చుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

Read More : tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్