YCP MP : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్టు..ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారు ? ఆ సెక్షన్లు ఏమి చెబుతున్నాయి

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం ఏపీ పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపింది.

YCP MP : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్టు..ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారు ? ఆ సెక్షన్లు ఏమి చెబుతున్నాయి

Ycp Mp Raghu

Advocate Arun Case : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం ఏపీ పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపింది. అసలు ఎందుకు అరెస్టు చేశారనే చర్చ మొదలైంది. రఘురామ కృష్ణంరాజుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టుకు ముందు సెక్షన్ 50 కింద ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే..నోటీసులు తీసుకొనేందుకు రఘురామ నిరాకరించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. అసలు ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారు ? ఆ సెక్షన్లు ఏమి చెబుతున్నాయి. అనే దానికి అడ్వకేట్ అరుణ్..10tvతోొ ముచ్చటించారు.

IPC 124 A సెక్షన్ అంటే ఏమిటీ ?
IPC 124 A సెక్షన్ : తెలిసి కానీ..తెలియక కానీ..రికార్డుగా ప్రభుత్వాన్ని కించపరిచి..ముఖ్యమంత్రులను తూలనాడడం..తల తీస్తాననడం..హెచ్చరిక జారీ చేయడం..రెండింటికి..చట్టం తనపని తాను చేసుకపోతుందనడానికి ఉదహారణ అని చెప్పారు అడ్వకేట్ అరుణ్. ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారికి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేయవచ్చు..సీఐడీ చేసింది.

IPC 153 B సెక్షన్ : ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడం, వ్యాఖ్యలు చేయడం ఈ సెక్షన్ కింద వస్తుందన్నారు.
ఐపీసీ 505 సెక్షన్ : క్రిమినల్ కామెంట్స్ కిందకు వస్తుంది. ముఖ్యమంత్రి తల తీస్తాననడం, ప్రాణాలు తీస్తానని బెదిరించడం ఈ సెక్షన్ కిందకు వస్తుంది.

IPC 120 B సెక్షన్ : మరికొంతమంది వ్యక్తులతో కలసి..కుట్ర పూరితంగా..వ్యవహరిస్తూ..ప్రభుత్వానికి సీఎంకు వ్యతిరేకంగా..పరుషపదజాలం వాడుతుంటూ..కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా..అదీ..ఎంపీ అయి ఉండి..సీఐడీ కేసు రిజిష్టర్ చేసింది. పద్ధతి ప్రకారం గోడపై నోటీసులు అంటించింది’ అని తెలిపారు అడ్వకేట్ అరుణ్.

Read More : కరోనాని జయించిన కొద్ది రోజులకే పన్నీరు సెల్వం తమ్ముడు మృతి