YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అంతర్గత పోరులు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు సరికదా అంతకంతకు పెరుగుతోంది. తమ సొంతపార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు బాలినేని, కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ycp Leaders Balineni..kotamreddy Sensatinal Comment

YCP Politics  : ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు నడుస్తున్న వేళ అన్ని పార్టీలు ఇన్ డైరెక్టుగా ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఏదోక కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు ఆయా పార్టీల నేతలు. ఈక్రమంలో అధికార పార్టీ వైసీపీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. కానీ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనే వైసీపీలో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆధిపత్య పోరుతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నేతలు..దీంతో వైసీపీ క్రమశిక్షణ లేకుండాపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ అనే మాట బహుశా వైసీపీ నేతలకు సెట్ అవ్వదంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సెటైర్లు కూడా వేస్తున్నారు.ఎందుకంటే వైసీపీ నేతలు ఎక్కువగా అసభ్యపదజాలాలు ఉపయోగిస్తుంటారు.

ఇదిలా ఉంటే ఓ పక్క ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ వైసీపీ అంతర్గత పోరులు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు సరికదా అంతకంతకు పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బహుశా టికెట్ కోసం ఇటువంటి ఆదిపత్యం పోరులతో కోల్డ్ వార్ కొనసాగిస్తున్నారు నేతలు. ఓ పక్క ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్న అధికార వైసీపీకి సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ కు సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న నేతలు ఒకరి వెంట మరొకరు బయటికి వచ్చి తమపై సొంత పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుండటం సంచలనం రేపుతోంది.

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని సొంతపార్టీ వారే తనపై కుట్రలు చేస్తున్నారని..సొంతపార్టీవారి నుంచే తనకు శతృవులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అదే తరహాలు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోనూ ఇదే పరిస్ధితి ఉందని అన్నారు. దీంతో వైసీపీ పార్టీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? తమ నియోజకవర్గాల్లో వేరే వారు వచ్చి జోక్యం చేసుకోవటం ఏంటి అంటూ మండిపడుతున్నారు బాలినేని, కోటంరెడ్డిలు. ఒంగోలు, నెల్లూరు రూరల్ సహా పలు నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వైసీపీ సీనియర్ నేతలు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలకు మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. దీంతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలుచేసుకుంటు వైసీపీని రచ్చ రచ్చ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో నిన్న మొన్నటివరకూ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత, సీఎం జగన్ కు దూరపు బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. సోమవారం హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి తనపై పార్టీలో సొంత నేతలే కుట్రలు చేస్తున్నారని వాపోయారు. సొంత పార్టీ నేతల కుట్రలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అంతర్గత పోరుకు నిదర్శనంగా నిలిచాయి.

సొంత పార్టీ నేతల రాజకీయాలపై నిన్న బాలినేని చేసిన కామెంట్లపై ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తన నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉందని సొంత పార్టీ నేతలే తమపై కుట్ర పన్నుతున్నారంటూ వాపోయారు.వ్యక్తిత్వ విషయాలపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలని, అంతే కాని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాలినేని చాలా మంచి వ్యక్తి అని..పదవులపై ఆయనకు ఏమాత్రం ఆశలేదని..మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి బాలినేని అన్నారు. అలాంటి వ్యక్తి సొంతపార్టీ వ్యక్తులు ద్రోహం చేస్తున్నారని ఆయన బాధపడటం నాకు బాదేసిందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

బాలినేని సమస్య ఎలా ఉందో అదే సమస్యతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని కోటంరెడ్డి తెలిపారు. వైసీపీలో కొంతమంది ముఖ్యనేతలకి, ఎమ్మెల్యేలకి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం ఎక్కువైందన్నారు. వైసీపీ పెట్టక ముందు నుంచి పార్టీ కోసం కష్టం పడిన వ్యక్తుల్లో తాను ఒక్కడిననన్నారు.

పార్టీని ఎలా ముందుకు తీస్కెళ్లాలి?ఎలా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలో చూసుకోకుండా ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని కోటంరెడ్డి వాపోయారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీని వైసీపీలోని కొంతమంది ముఖ్య నేతలు నా నియోజవర్గంలో వేలు పెడుతున్నారని అటువంటివారు తమ పని తాము చూసుకుంటే మంచిదని లేదంటూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇతర నియోజకవర్గాల నేతలు రూరల్ లో తనను బలహీనం చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు. జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు తననేమీ చేయలేరని కోటంరెడ్డి హెచ్చరించారు.