Alla Nani : తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం, ఒక్క సీటు కూడా గెలవనివ్వం- పవన్ కల్యాణ్‌కు ఆళ్ల నాని వార్నింగ్

Alla Nani : ప్రశాంతంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలలో రౌడీలు, గుండాలు ఉన్నారు అంటున్నారు.

Alla Nani : తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం, ఒక్క సీటు కూడా గెలవనివ్వం- పవన్ కల్యాణ్‌కు ఆళ్ల నాని వార్నింగ్

Alla Nani (Photo : Google)

Updated On : June 27, 2023 / 8:34 PM IST

Alla Nani – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీమంత్రి ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు. సీఎం జగన్ పై ద్వేషంతో పవన్ రోజూ విషం చిమ్ముతున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు. సీఎం జగన్ ను తిట్టడానికి, చంద్రబాబును సీఎం చెయ్యడానికి పవన్ యాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

”జనసేన రాష్ట్ర పార్టీనా? గోదావరి జిల్లాల పార్టీనా? పవన్ తిడుతున్నా సహనంతో ఉన్నాం. చేతకాక కాదు. తనను ఓడించారని ప్రజలపై అక్కసు కక్కుతున్నాడు పవన్. ప్రశాంతంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలలో రౌడీలు, గుండాలు ఉన్నారు అంటున్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండే వారి మధ్య కుల చిచ్చు పెడుతున్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం దురదృష్టకరం. దేవుళ్ళను సైతం రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం.

Also Read..Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ తీరు మార్చుకోవాలి. ఇలానే ఉంటే బుద్ది చెబుతాం. గోదావరి జిల్లాల్లో ఒక్క స్థానం కూడా టీడీపీ, జనసేన గెలవకుండా చేసే సత్తా మాకుంది. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్క స్థానం కూడా రాదు. పవన్, చంద్రబాబులది ఒకటే గొంతుక, ఒకటే నాలుక. టీడీపీ హయాంలో పోలవరం పనులు ఎలా జరిగాయో, వైసీపీ హయాంలో ఎలా జరిగాయో పవన్ అధ్యయనం చెయ్యాలి. పోలవరం మొదలు పెట్టింది వైఎస్ఆర్, పూర్తి చేసి ప్రారంభించేది జగనే అనేది పవన్ గుర్తు పెట్టుకోవాలి. వారాహితో ఎన్నిసార్లు తిరిగినా పవన్ కల్యాణ్.. వైసీపీని ఏమీ చెయ్యలేరు. జగన్ ను సీఎం కానివ్వనని 2019లోనూ శపథం చేశారు.. మరి ఏమైంది?” అని ఆళ్ల నాని అన్నారు.

Also Read..TDP Leaders : జగన్ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు.. నెల్లూరు నుండే వైసీపీ పతనం ప్రారంభం : టీడీపీ నేతలు