Amaravati Farmers : నేడు తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్ర

నేడు తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఈ సాయంత్రం లోపు అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తెలిపారు.

Amaravati Farmers : నేడు తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్ర

Amaravati

Amaravati Farmers Padayatra : నేడు తిరుపతి నగరంలో అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఈ సాయంత్రం లోపు పాదయాత్ర అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. అలిపిరి వద్ద గల గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుపతి యాత్ర ముగించే యోచనలో అమరావతి రైతులు ఉన్నారు. శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం అమరావతి రైతుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 500 మంది రైతులకు రెండు, మూడు విడతలుగా దర్శనం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

మరోవైపు సోమవారం అమరావతి పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అడ్డుపడుతోందని పిటిషన్‌లో రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ హైకోర్టుకు వెల్లడించారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతివ్వకుండా పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారని పేర్కొన్నారు.

Maoist Attack : రెచ్చిపోయిన మావోలు.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ దారుణ హత్య

డీజీపీ.. మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని కోర్టుకు వెల్లడించారు. సభకు అనుమతి ఇవ్వాలా?…వద్దా? అనేది నిర్ణయించాల్సింది జిల్లా ఎస్పీ అని, అలాంటిది సభపై ఓ డీఎస్పీ అధికారి నిర్ణయం ఎలా తీసుకుంటారని న్యాయవాది లక్ష్మినారాయణ రిట్ పిటిషన్‌లో ప్రశ్నించారు. అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది.