Ambati Rambabu: అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు.. అంటూ మంత్రి అంబటి సంచలన కామెంట్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ దేశాయ్ వీడియో విడుదల వెంటనే అంబటి రాంబాబు ట్విట్టర్‌లో స్పందించారు.

Ambati Rambabu On Renu Desai
Ambati Rambabu – Renu Desai: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ (YCP) నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వేళ దీనిపై పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు రేణూ దేశాయ్‌పై విమర్శలను తిప్పికొడుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ దేశాయ్ వీడియో విడుదల వెంటనే అంబటి రాంబాబు ట్విట్టర్‌లో స్పందించారు. ” అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని! ” అని కామెంట్స్ చేశారు. బ్రో సినిమాలో తన పాత్ర ఎందుకు పెట్టారంటూ అంబటి మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే ఇప్పుడు ఆయన మళ్లీ ప్రస్తావించారు.
అలాగే, వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా టీమ్స్ కూడా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తుండడం గమనార్హం. గతంలో పవన్ పై రేణు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. కాగా, తన పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లో లాగకూడదని రేణూ దేశాయ్ చెప్పింది. పవన్ ఓ అరుదైన వ్యక్తి అంటూ, ఆయనకు రాజకీయంగా తన మద్దతు ఉంటుందని తెలిపింది.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు
మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !— Ambati Rambabu (@AmbatiRambabu) August 10, 2023
నా విషయంలో @PawanKalyan తీరు తప్పే …
నాతో కాపురం చేస్తూనే మరో అమ్మాయితో బిడ్డను కన్నాడు..
పవన్ నాకు అన్యాయం చేశారు …
అందులో మరో మాట లేదు :రేణుదేశాయ్ (#PackageStarPK రెండవ భార్య)#PoliticalBrokerPK#YSRCPITWING#SuneelPosimreddy pic.twitter.com/GBcLiP1qIo— YSRCP IT WING Official (@ysrcpitwingoff) August 10, 2023
రేణు దేశాయి గారు…
ఒక భర్తగా నీ దృష్టిలో చేసింది 100% తప్పై అని చెప్తూనే ఇలా మంచి చేస్తాడు అని చెప్పడం బలే విడ్డురం గా ఉంది
— GV రాజు యాదవ్ YSRCP ?? (@IamRajuYadav3) August 10, 2023