AP Heavy Rains Cyclone : వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం..భారీ వర్షాలు పడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ఒడిశాలోని భువనేశ్వర్‌కి ఉత్తర వాయువ్యంగా 70కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు చెప్పింది.

AP Heavy rains cyclone
AP Heavy Rains Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ఒడిశాలోని భువనేశ్వర్‌కి ఉత్తర వాయువ్యంగా 70కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు చెప్పింది. రానున్న 24 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు మరో రెండు రోజుల పాటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలతో ఏలూరు జిల్లా తడిసిముద్దౌతోంది. ఎడతెరిపిలేని వర్షాలు.. వరదలకు వాగులు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ జలాశయానికి వరదనీరు పోటెత్తింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 6వేల 6వందల 13 క్యూసెక్కులుండటంతో..డ్యామ్ గేట్లు ఎత్తి 3వేల 6వందల 35క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
ఇక్కడ గంటగంటకు వరద స్థాయి పెరుగుతోంది. దీంతో ఔట్‌ఫ్లో పెంచే ఆలోచనలో ఉన్నారు..అధికారులు. ఇక ఎర్రకాలువ ఉధృతికి పంగిడిగూడెంలో లోలెవల్ వంతెన నీటమునిగింది. పట్టెన్నపాలెం దగ్గర జల్లేరువాగు ఉప్పొంగింది. దీంతో ఎగువనుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యలగూడెం, నల్లజర్ల, పంగిడిగూడెం, తాడేపల్లిగూడెంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అల్లూరి జిల్లాలోని కూనవరంలో శబరి-గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. వదర బాధితులను మళ్ళీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చింతూరు, కూనవరంలో శబరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.